
● హార్వెస్ట్‌కు ఉత్తమ ర్యాంకులు
హార్వెస్ట్ విద్యాసంస్థల విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారని కరస్పాండెంట్ పి.రవిమారుత్, ప్రిన్సిపాల్ పార్వతిరెడ్డి తెలిపారు. ఆలిండియా స్థాయిలో వివిధ కేటగిరీల్లో బి.సాయిచరణ్ 83వ ర్యాంకు, బి.సంజయ్ 207, ఎం.నాగయశ్వంత్ 393, బి.సిద్దార్థ్ 395, డి.శ్రీనివాస గౌతమ్‌రెడ్డి 686, వి.చరణ్ గోపాల్‌స్వామి 1,092, బి.మోక్షజ్ఞ 1,159, పి.క్రిష్ సాత్విక్ 1,163, ఎ.గణేష్ 1,195, ఎన్.సీ.హెచ్.జస్వంత్ సాయి 1,268, ఎన్.రాఘవేంద్ర నవనీత్ 2,108, పి.ప్రేమ్‌వర్ధన్ 5,078, వి.సాయిదీపక్ 6,001 ర్యాంకు సాధించారని వెల్లడించారు.