పీజీ కళాశాలలో కొత్త కోర్సులు | - | Sakshi
Sakshi News home page

పీజీ కళాశాలలో కొత్త కోర్సులు

Mar 20 2025 12:25 AM | Updated on Mar 20 2025 12:24 AM

● కాలేజ్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌కు ప్రతిపాదనలు ● జాబితాలో నాలుగు కోర్సులు ● అన్నీ అనుకూలిస్తే వచ్చే విద్యాసంవత్సరంలో ప్రారంభం

ఖమ్మం సహకారనగర్‌: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు సత్తా చాటేలా విద్యారంగంలోనూ మార్పులు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు భవిష్యత్‌ బాగుండేలా కొత్త కోర్సులు నేర్చుకోవడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈనేపథ్యాన విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉండే కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఖమ్మంలోని యూనివర్సిటీ పీజీ కళాశాల అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఉన్నతాధికారులకు ప్రతిపాదన

ఖమ్మంలోని కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న కోర్సులకు తోడు ఎంసీఏ, ఎంఏ మ్యాథ్స్‌, ఎంఏ తెలుగు, మాస్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులు ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. ఈమేరకు కాలేజ్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (సీడీసీ) డీన్‌కు తాజాగాప్రతిపాదనలు పంపారు. అక్కడి నుంచి అనుమతులు రాగానే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే అవకాశముంది. విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్‌ మేరకు ఈ కోర్సులను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

కమిటీ పరిశీలించాకే..

ప్రస్తుతం నూతన కోర్సులు ప్రవేశపెట్టడానికి కళాశాల నుంచి సీడీసీ డీన్‌కు ప్రతిపాదనలు పంపారు. వీటిని పరిశీలించాక వీసీ, రిజిస్ట్రార్‌ అనుమతి జారీ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఖమ్మంలో కొత్త కోర్సుల ఆవశ్యకత, వీటిని బోధించేందుకు సరిపడా అధ్యాపకులు ఉన్నారా, ఒకవేళ ప్రవేశపెడితే ప్రవేశాలు ఉంటాయా అన్నది కమిటీ ద్వారా పరిశీలించాక మంజూరు చేసే అవకాశముంది.

ప్రతిపాదనలు పంపాం..

విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్‌ మేరకు కొత్త కోర్సు ప్రారంభానికి చర్యలు తీసుకున్నాం. ఇందులో భాగంగా యూనివర్సిటీకి ప్రతిపాదనలు పంపించాం. ఉన్నతాధికారులు పరిశీలించి ఆమోదిస్తే వచ్చే విద్యాసంవత్సరం తరగతులు మొదలయ్యే అవకాశముంది.

– రవికుమార్‌, ప్రిన్సిపాల్‌,

యూనివర్సిటీ పీజీ కళాశాల, ఖమ్మం

పీజీ కళాశాలలో కొత్త కోర్సులు1
1/1

పీజీ కళాశాలలో కొత్త కోర్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement