విద్యుత్‌ శాఖ పొలంబాట | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ శాఖ పొలంబాట

Jul 29 2024 12:26 AM | Updated on Jul 29 2024 12:26 AM

విద్యుత్‌ శాఖ పొలంబాట

విద్యుత్‌ శాఖ పొలంబాట

ఖమ్మంవ్యవసాయం/ముదిగొండ : రైతులకు మరింతగా చేరువయ్యేందుకు టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ ఆదేశాల మేరకు ‘విద్యుత్‌ శాఖ పొలంబాట’ కార్యక్రమాన్ని జిల్లాలో ఆదివారం ప్రారంభించారు. విద్యుత్‌ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం లక్ష్మీపురంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పొలంబాటలో భాగంగా ఒరిగిన స్తంభాలను సరిచేయడం, విరిగిన, ప్రమాదకరంగా ఉన్న స్తంభాలను మార్చటం, కిందకు వేలాడుతున్న విద్యుత్‌ వైర్లను సరిచేయడం వంటి పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్‌ సర్కిల్‌ ఎస్‌ఈ ఎ.సురేందర్‌ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడం, విద్యుత్‌ భద్రత సూత్రాలు, విద్యుత్‌ పొదుపు వంటి అంశాలపై అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రైతులు విద్యుత్‌ మోటార్ల వద్ద తగిన కెపాసిటర్లను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్‌ డీఈ బాబూరావు, ముదిగొండ ఏడీఈ బీంసింగ్‌, ఏఈ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

లక్ష్మీపురం నుంచి శ్రీకారం చుట్టిన అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement