రాయచూరు రూరల్: పంచ రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ ఘనవిజయం సాధించడంతో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. సోమవారం నగరంలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన విజయోత్సవంలో శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, అధ్యక్షుడు వీరనగౌడ మిఠాయిలు పంపిణీ చేశారు. బీదర్ దక్షిణ శాసన సభ్యుడు శైలేంద్ర బెల్దాళ్ మాట్లాడుతూ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయ ఢంకా మోగించిందన్నారు. ఇది పార్టీ కార్యకర్తల విజయంగా భావించాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌షా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం దక్కిందన్నారు. భవిష్యత్తులో మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పతాకం రెపరెపలాడుతుందన్నారు. కర్ణాటకలోని బాగల్‌కోటె, దావణగెరెల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంపై రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, ఆ పార్టీ విధాన పరిషత్ సభ్యుడు వసంత కుమార్, రాయచూరు రూరల్ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ హర్షం వ్యక్తం చేశారు.


