హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి పురపాలక సంఘం నూతన అధ్యక్షురాలిగా రేష్మా సికందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సభ్యులందరి సహకారంతో రాబోయే రోజుల్లో అందరినీ విశ్వాసంలోకి తీసుకొని, పురపాలక సంఘం పరిధిలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తానని అన్నారు. తాగునీరు, సీసీ రోడ్ల నిర్మాణం, మురుగు నీటిపారుదల వ్యవస్థతో పాటు పారిశుధ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ఆమె తెలిపారు. సంఘం ఉపాధ్యక్షురాలు నేత్రావతి హుచ్చప్ప సెరెగార, మాజీ అధ్యక్షులు ఎం.మరిరామప్ప, మాజీ ఉపాధ్యక్షురాలు అంబికా దేవేంద్రప్ప, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోరి గోణిబసప్ప, మహిళా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సాహేరా బాను, తాలూకా అధ్యక్షురాలు యశోదా మంజునాథ్, నాయకులు సికందర్, గుండ్రు హనుమంత, సెరెగార హుచ్చప్ప, కవితా ఆల్దాళ్, ఉప్పర బాలప్ప, త్యావణిగి కొట్రేష్, బారికర్ బాపూజీ, మడివాళర్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


