అభిమానోత్సవానికి భారీగా తరలి రండి | - | Sakshi
Sakshi News home page

అభిమానోత్సవానికి భారీగా తరలి రండి

May 5 2026 6:56 AM | Updated on May 5 2026 6:56 AM

సాక్షిబళ్లారి: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్‌ నాయకుడు బీఎస్‌.యడియూరప్ప రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టడమేగాకుండా రైతు సంక్షేమానికి ఎంతో శ్రమించారని విధాన పరిషత్‌ సభ్యుడు వైఎం సతీష్‌, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ మోకా పేర్కొన్నారు. సోమవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. చిత్రదుర్గలో ఈ నెల 9న యడియూరప్ప అభిమానోత్సవాన్ని నిర్వహిస్తున్నారన్నారు. బళ్లారి జిల్లా నుంచి వేలాది మంది తరలి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారన్నారు. బీజేపీ కార్యకర్తగా రాజకీయ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగి ఆదర్శ రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారన్నారు. రాష్ట్రంలో రైతు పర, నీటి పారుదల, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారన్నారు. బళ్లారి జిల్లా అభివృద్ధికి కూడా అందించిన సహకారం మరువలేనిదన్నారు. జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు గుత్తిగనూరు విరుపాక్షగౌడ, మురారీ గౌడ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement