లేట్‌గా వచ్చారని.. నీట్‌కు నిరాకరణ | - | Sakshi
Sakshi News home page

లేట్‌గా వచ్చారని.. నీట్‌కు నిరాకరణ

May 4 2026 7:31 AM | Updated on May 4 2026 7:31 AM

శివాజీనగర: నీట్‌–యూజీ పరీక్షలకు ఆలస్యంగా రావడంతో పలువురు విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. బెంగళూరులోని యలహంక ప్రథమ శ్రేణి కాలేజీలో ఇద్దరు విద్యార్థినులు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చారు. ఈ క్రమంలో సిబ్బంది వారిని అడ్డుకున్నారు. చాళుక్య సెంటర్‌లోని ఆర్‌సీ కాలేజీకి అత్తిబెలెకు చెందిన ఓ విద్యార్థిని 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది, ఆమెను కూడా లోపలికి పంపలేదు. మధ్యాహ్నం 2 గంటలకు నీట్‌ పరీక్ష ఆరంభంకాగా, మధ్యాహ్నం 1.30 గంటల వరకు గేట్లు తెరిచారు. ట్రాఫిక్‌ జాం వల్ల ఆలస్యమైనట్లు విద్యార్థినులు తెలిపారు. ఏడాది పాటు శిక్షణ పొందామని, ఆలస్యమంటూ అనుమతించలేదని విలపించారు. కాగా పరీక్షా కేంద్రాల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది.

పలువురు విద్యార్థినుల కన్నీరు

Advertisement
 
Advertisement
Advertisement