స్వాతంత్య్రం కోసం బీజేపీ పోరాడలేదు
● సీఎం సిద్ధరామయ్య
యశవంతపుర: ఇందిరాగాంధి ఆదర్శాలను అందరూ పాటించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి, దివంగత సర్దార్ వల్లభాయి పటేల్ 150వ జయంతి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధి ఉక్కు మహిళ. బాంగ్లాదేశ్ విమోచన సందర్భంగా ఇందిరాగాంధిని దుర్గగా సంబోధించారు. బాంగ్లాదేశంపై యుద్ధం సమయంలో పాకిస్తాన్‌కు చెందిన 90 వేల మంది సైనికులను అరెస్ట్ చేశారు. ఇందిరాగాధీ ధీమంతమైన నాయకురాలిగా పేరుగాంచారు. దేశానికీ కీర్తి ప్రతిష్ఠిలు తెచ్చినట్లు సిద్ధరామయ్య వివరించారు. పేదల కోసం 20 సూత్రాలను అమలు చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం ఇందిరాగాంధి నేతృత్వంలో నెహ్రు, వల్లబాయి పటేల్, సుభాష్ చంద్రబోస్‌లతో కలిసి పోరాటం చేశారన్నారు.
తప్పు ఒప్పుకున్న సుజాత భట్
బనశంకరి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనన్యభట్ అదృశ్యం కేసు దర్యాప్తును సిట్ అధికారులు పూర్తి చేశారు. కుమార్తె ధర్మస్థలలో కనబడలేదని సుజాత భట్ ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులకు అబద్ధమని రుజువైంది. సిట్ అధికారుల విచారణలో సుజాతభట్ అబద్ధం చెప్పినట్లు ఒప్పుకోవడంతో కేసు దర్యాప్తు పూర్తి చేశారు. సుజాతభట్ ఫిర్యాదును క్లియర్ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. అంతిమంగా సుజాతభట్ ధర్మస్థల కేసుకు సంబంధించి తల పుర్రె గ్యాంగ్‌తో చేరడంపై తీవ్ర పశ్చాత్తాపం చెందింది. ఇతరుల మాటలు విని తమ జీవితం నాశనం చేసుకోవడం ఇష్టం లేదని, దీనిపై ధర్మస్థల వీరేంద్రహెగ్డే వద్ద క్షమాపణ కోరతానని తెలిపింది. ఈ విషయంలో మహేశ్‌శెట్టి తిమరోడి, గిరీశ్ మట్టణ్ణవర్‌తో పాటు ఇతరులతో ప్రస్తుతానికి సంబంధాలు లేవని స్పష్టం చేశారు.


