ఇళ్ల పంపకం.. అవినీతి సంకటం | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల పంపకం.. అవినీతి సంకటం

Jun 23 2025 5:54 AM | Updated on Jun 23 2025 5:54 AM

ఇళ్ల

ఇళ్ల పంపకం.. అవినీతి సంకటం

శివాజీనగర: లంచాలు ఇవ్వనిదే గృహవసతి శాఖలో ఇళ్ల పంపిణీ జరగడం లేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌ ఆడియోలో ఆరోపణలు చేసిన తరువాత ఆ శాఖ బాగోతాలు బహిరంగమవుతున్నాయి. ప్రతి ఇంటి మంజూరుకు రూ. 40 వేల ముడుపులు అడిగిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు (పీఏ) మరో ఆడియో ఇప్పుడు సిద్దరామయ్య సర్కారుకు సంకటంగా మారింది. విజయపుర జిల్లా నాగఠాణ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విఠల్‌ కఠకదొండ వ్యక్తిగత సహాయకుడని చెబుతున్న ఓ వ్యక్తి ఆడియో ప్రచారంలో ఉంది. రామపుర గ్రామ పంచాయితీ తాండాకు ఇళ్లు మంజూరు గురించి అందులో చర్చించారు. తాను ఎమ్మెల్యే పీఏనంటూ.. నా వద్ద 21 ఇళ్లు ఉన్నాయి. మీరు తలా రూ.40 వేలు ఇస్తే మీకు మంజూరు చేస్తాము, లేకపోతే మరొకరికి వెళ్తుందని అందులో చెప్పాడు.

డీసీఎం ఖండించినా కూడా..

ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణానికి రూ. 1.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేస్తుంది, అందులో లంచం అడిగేందుకు సాధ్యమేనా అని డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్‌ అన్నారు. లంచాలకు తావు లేదన్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే బీ.ఆర్‌.పాటిల్‌ ఆడియోలో మాటలను నేను ఆమోదించను. ఆ విధంగా జరగడానికి సాధ్యమే లేదని అన్నారు. ఇంతలోనే మరో ఆడియో వైరల్‌ కావడంతో అధికార పక్షానికి ఇబ్బందిగా మారిది. ఆడియో నేపథ్యంలో ఎమ్మెల్యే విఠల్‌ మాట్లాడుతూ ఎవరి నుంచైనా రూ. 10 పైసలు తీసుకొన్నట్లు రుజువుచేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ చేశారు. పీఏ తప్పు చేస్తే శిక్షించాలని కోరారు. మంత్రి జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ శాఖపై వరుసగా ఆరోపణలు వెల్లువెత్తడంతో మంత్రికి చిక్కులు తప్పేలా లేవని ప్రచారం నడుస్తోంది.

నియోజకవర్గంలో బాగా లేదు: బీఆర్‌

గృహ వసతి పథకం కింద ఇళ్ల మంజూరుకు లంచాలు తీసుకుంటున్నారని ఫోన్‌లో మాట్లాడిన వ్యవహారంలో నన్ను సీఎం సిద్దరామయ్య పిలవలేదు. పిలిస్తే తప్పకుండా వెళతాను. డీసీఎం డీ.కే.శివకుమార్‌తోను చర్చలకు సిద్ధమేనని కలబుర్గి జిల్లా అళంద హస్తం ఎమ్మెల్యే బీ.ఆర్‌.పాటిల్‌ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన, డీకే శివకుమార్‌ తనను ఇంకా పిలవలేదన్నారు. మంత్రి జమీర్‌ అహ్మద్‌ పీఎస్‌తో మాట్లాడిన ఆడియో లీకేజ్‌ గురించి నాకు తెలియదు. పీఎస్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌కు కాల్‌ చేసి ఒక ఇల్లు మంజూరుకు అడిగాను. మంత్రి కృష్ణభైరేగౌడ మాట్లాడిన ఆడియో అంత సీరియస్‌ కాలేదు. అయితే నా ఆడియో ఎందుకు ఇంత రచ్చ అవుతోందో అర్థం కావటం లేదని చమత్కరించారు. నేను బ్లాక్‌మెయిల్‌ చేసి మంత్రి అయ్యేవాన్ని కాదని అన్నారు. నా నియోజకవర్గానికి అల్పసంఖ్యాక శాఖ ద్వారా రూ. 17 కోట్ల నిధులు వచ్చాయి, ఆ విషయంలో నాకు సమాచారమే లేదని ఆరోపించారు. పాఠశాల భవన నిర్మాణం ప్రారంభానికి ఆహ్వానించలేదు అని సర్కారు తీరుపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు సమాచారం ఉండాలి కదా? అని ప్రశ్నించారు.

బీఆర్‌ పాటిల్‌కు సీఎం పిలుపు

గృహ వసతి పథకంలో లంచాలు తీసుకుంటున్నారని ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే బీఆర్‌ పాటిల్‌కు ముఖ్యమంత్రి సిద్దరామయ్య నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల 25వ తేదీన సాయంత్రం బెంగళూరుకు వచ్చి కలవాలని కబురు పంపారు. బుజ్జగిస్తారా, వేటేస్తారా అనేది సస్పెన్స్‌గా ఉంది.

రూ.40 వేలు ఇస్తేనే మంజూరు

మరో ఎమ్మెల్యే ఆడియో లీక్‌

ఇప్పటికే బీఆర్‌ పాటిల్‌ ఆడియోతో

సిద్దు సర్కారుకు తలనొప్పులు

ఇళ్ల పంపకం.. అవినీతి సంకటం1
1/2

ఇళ్ల పంపకం.. అవినీతి సంకటం

ఇళ్ల పంపకం.. అవినీతి సంకటం2
2/2

ఇళ్ల పంపకం.. అవినీతి సంకటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement