
యువత ఉద్యోగ దాతలుగా ఎదగాలి
హుబ్లీ: యువత ఉద్యోగం సంపాదించడానికి బదులుగా స్వంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ దాతలు కావాలని ఎమ్మెల్యే మహేష్ టెంగినకాయి, ఎమ్మెల్యే ఎంఆర్ పాటిల్‌లు సూచించారు. హుబ్లీ రోటరీ క్లబ్, ఉద్యోగ జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో కేఎల్‌ఈ సంస్థ సీసీ జాబిన్ సైన్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాను వారు ప్రారంభించి మాట్లాడారు. డిగ్రీ పూర్తి అయ్యాక విద్యార్థులు ఉద్యోగ సాధనకు ఎంతో ఎంతో శ్రమ పడుతారన్నారు. దొరికిన ఉద్యోగం తీసుకొని అక్కడే నైపుణ్యాన్ని సాధించి ఇతర కంపెనీలలో ఉన్నత ఉద్యోగాలకు కృషి చేస్తుంటారన్నారు. అయితే స్వతహాగా పరిశ్రమలు ఏర్పాటు చేసి మరికొందరికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు.మేళా నిర్వహకులు ఎమ్మెల్సీ ఫ్రొసిసర్ ఎస్‌వీ సంకనూరు మాట్లాడుతూ గదగ, ధార్వాడ, హావేరిలలో ఉద్యోగ మేళ ఏర్పాటు చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాను. ఆ మేరకు గత 10 ఏళ్ల నుంచి ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేస్తున్నానన్నారు. కెనరా బ్యాంక్ ప్రాంతీయ చీఫ్ నజల్ సమీర్, జిల్లా పరిశ్రమల కేంద్రం ఏడీ మంజునాథ హొసమని, కేఎల్‌ఈ సంస్థ డైరెక్టర్ శంక్రన్న మునవళ్లి, రోటరీ క్లబ్ అధ్యక్షుడు బాపుగౌడ పాటిల్, కార్యదర్శి ఏవీ సంకనూర, ప్రిన్సిపల్ డాక్టర్.సంధ్య కులకర్ణి, తదితరులు పాల్గొన్నారు.