
కమల్ మీద తగ్గని కన్నెర్ర
శివాజీనగర/ దొడ్డబళ్లాపురం: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడమైనది. నేను ఎవరికీ బాధ కలిగించే ఉద్దేశంతో మాట్లాడలేదు. కన్నడ భాషకు ఘనమైన చరిత్ర ఉందనేది నిస్సందేహం అని కన్నడిగుల కన్నెర్రకు గురైన ప్రముఖ నటుడు కమల్‌హాసన్ పేర్కొన్నారు. ఈ మేరకు కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి కి లేఖ రాశారు. తన కొత్త సినిమా థగ్ లైఫ్‌ని కర్ణాటకలో ఆడనివ్వబోమని మండలి, కన్నడ సంఘాలు ఖరాఖండిగా చెప్పడంతో కమల్ లేఖ ద్వారా బుజ్జగించే ప్రయత్నం చేశారు. మనమంతా ఒకే కుటుంబం, కన్నడ భాష గౌరవాన్ని తగ్గించే ఉద్దేశం లేదు, కన్నడ సంస్కృతిని గౌరవిస్తాను అని లేఖలో తెలిపారు. ఏ భాషను కించపరచినా నేను పోరాటం చేశాను అని చెప్పారు. అయితే లేఖలో ఎక్కడా కమల్ క్షమాపణ చెప్పకపోవడం గమనార్హం.
కోర్టులో గుణపాఠం దక్కింది
కమల్‌హాసన్‌కు ఇకపై కర్ణాటకలోకి ప్రవేశం ఉండదని కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు నారాయణగౌడ అన్నారు. హైకోర్టు కమల్‌కు తగిన రీతిలో గుణపాఠం చెప్పిందన్నారు. హైకోర్టు జడ్జి కన్నడిగుల మనసుని బాగా అర్థం చేసుకున్నారన్నారు. థగ్ లైఫ్ ఒక్కటే కాదు, ఇకపై కమల్ సినిమాలు ఏవీ కర్ణాటకలో రిలీజ్ కావన్నారు. మరోవైపు బెళగావిలో కన్నడ సంఘాలు బృహత్ నిరసన ర్యాలీ నిర్వహించాయి. కమల్ ఫోటోని చించి నిప్పు పెట్టారు.
● కమల్‌ది మొండితనం: డీకే
నటుడు కమల్‌హాసన్‌పై తమకు ఎలాంటి మెతక ధోరణి లేదు అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కమల్‌హాసన్ క్షమాపణ చెబుతారని అనుకున్నాం. కమల్‌హాసన్ వ్యాఖ్యలపై సోమవారం సాహితీవేత్త హంప నాగరాజయ్య తదితరులతో చర్చించాను. ద్రావిడ భాషలన్నీ కూడా ఒక్కటే. తమిళు, కన్నడ, తెలుగు, మలియాళం పరస్పరం మిళితమయ్యాయి. ఇక్కడ ఎక్కువ, తక్కువ అనేదానికి చోటు లేదు అని అన్నారు. కమల్ మొండిగా ఉన్నారు. న్యాయస్థానం ఆదేశాలను అందరూ పాటించాలి అని చెప్పారు.
యడ్డి మండిపాటు
చరిత్ర, భాషాశాస్త్రం పరిజ్ఞానం లేని నటుడు కమల్‌హాసన్, కన్నడ భాషను కించపరిచేలా మాట్లాడటం ఖండనీయమని బీజేపీ నేత, మాజీ సీఎం బీ.ఎస్.యడియూరప్ప అన్నారు. కన్నడ ఏ భాష నుంచి పుట్టలేదని అనేక మంది సీనియర్ భాషా పండితులు రుజువులు చూపించారన్నారు.
కొనసాగిన ఆందోళనలు
కమల్‌హాసన్ బుజ్జగింపు లేఖ

కమల్ మీద తగ్గని కన్నెర్ర