
క్రూరంగా హత్య చేశారు
బనశంకరి: విశ్రాంత డీజీపీ ఓంప్రకాష్ హత్యకు గురయ్యే గంట ముందు వరకు వ్యక్తిగత సిబ్బందితో బాగానే మాట్లాడారు, ఇలా హత్యకు గురికావడం దురదృష్టకరమని వీవీఐపీ సెక్యూరిటీ విభాగం ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఓంప్రకాష్ ఇంటి వద్ద ఆయన మాట్లాడుతూ.. ఆదివారం మధ్యాహ్నం 3.05 నిమిషాలకు ఓంప్రకాష్కు ఫోన్ చేస్తే సంతోషంగా మాట్లాడారు, సోమవారం ఇంటికి వస్తాను సార్ అని చెప్పా, వద్దు ఇంట్లో మేడం ఉన్నారని సార్ చెప్పారు అని పేర్కొన్నారు. చాలా క్రూరంగా హత్య చేశారని, గొంతు భాగంలో రెండుసార్లు పొడిచారు, మృతదేహాన్ని చూడగానే సారేనా హత్యకు గురైంది అని దిగ్భ్రాంతికి లోనయ్యాను అన్నారు. కుమార్తెకు పెళ్లి చేసి, కొడుకుతో ఉంటానని చెప్పేవారన్నారు.