రాయచూరు రూరల్: ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైలం వెళ్లే కర్ణాటక భక్తుల పాదయాత్రలు ప్రారంభమయ్యాయి. బుధవారం నుంచి బాగల్‌కోటె, విజయపుర, జమఖండి, గదగ్, ధార్వాడ, హునగుంద, ఇలకల్ ప్రాంతాలకు చెందిన భక్త సమూహం వివిధ మార్గాల్లో మార్చి 18 నుంచి ఏప్రిల్ 1 వరకు 15 రోజుల పాటు ఏ రహదారిలో చూసినా మల్లయ్య భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు పాదయాత్రలకు అంకురార్పణ గావించారు. మల్లయ్య విగ్రహాన్ని మోసుకొని కాలి నడకలు, కొంత మంది యువకులు కాళ్లకు కర్రలు కట్టుకొని నడవడం వంటి దృశ్యాలు కనిపించాయి. బాగల్‌కోటె నుంచి శ్రీశైలానికి సుమారు 650 కిమీల పాదయాత్ర చేపట్టి ప్రతి రోజు తెల్లవారు జామున 3 గంటలకు ప్రారంభమైన పాదయ్రాతలు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కొనసాగిస్తారు.
శ్రీశైలానికి భక్తుల పాదయాత్రలు షురూ