
సీజ్ చేసిన ఆటోలను పరిశీలిస్తున్న అధికారులు
బళ్లారిఅర్బన్: నగరంలో యథేచ్ఛగా తిరుగుతున్న ఆటోలపై ట్రాఫిక్ సీఐ నిఘా ఉంచి పట్టుకున్నారు. మంగళవారం స్థానిక నటరాజ్ థియేటర్ ఎదురుగా బెంగళూరు రోడ్డులో ఆటోలను నిలిపి సంబంధిత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్, కండీషన్ పత్రాలు, పర్మిట్ లేని వాహనాలను బళ్లారి ఆర్‌టీఓ బ్రేక్ ఇన్‌స్పెక్టర్ నిజాముద్దీన్, ట్రాఫిక్ సీఐ అయన్నగౌడ పాటిల్, సిబ్బంది తనిఖీలు నిర్వహించి 33 ఆటోలను సీజ్ చేశారు.
గ్రీన్ బోర్డుల ఏర్పాటు భేష్
రాయచూరు రూరల్: తాలూకాలో 9 పాఠశాలలకు రోటరీ క్లబ్ కాటన్ సిటీ ఆధ్వర్యంలో గ్రీన్ బోర్డులను ఏర్పాటు చేయడం అభినందనీయమని మడ్డిపేటె ప్రభుత్వ హైస్కూలు హెడ్‌మాస్టర్ మల్లికార్జున పేర్కొన్నారు. మంగళవారం అస్కిహాళ, మడ్డిపేటలోని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రీన్ బోర్డుల అమరికను ప్రారంభించి మాట్లాడారు. క్లబ్ జిల్లాధ్యక్షుడు శివగిరీష్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ కాటన్ సిటీ, యూరోఫిన్స్ ఐటీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలో ఐదేళ్ల పాటు అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపారు. ఛాయాదేవి, వీరేష్, లక్ష్మణ్, శశిధర్, వేణుగోపాల్, మునిస్వామి, హుసేనప్ప, వసంత్‌లున్నారు.