
వినతిపత్రం సమర్పిస్తున్న నేతలు
రాయచూరు రూరల్: జిల్లాలో కరువు తాండవిస్తున్నందున తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అమరేష్ డిమాండ్ చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో కరువు నెలకొన్నా కేంద్ర కరవు బృందం పర్యటించకపోవడం అన్నదాతల సంక్షేమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న ప్రేమ ఏపాటిదో తెలుస్తోందన్నారు. వానలు లేక పంటలు నిట్టనిలువునా ఎండుతున్నాయన్నారు. పశువులకు మేత కూడా కరువైందన్నారు. తక్షణం స్పందించి కరువు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రూరల్ సీఐగా సోమశేఖర్ జట్టల్
గంగావతి: గంగావతి నూతన రూరల్ సీఐగా నియమితులైన సోమశేఖర్ జుట్టల్ బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణకు పోలీసులకు ప్రజల సహకారం అందించాలన్నారు.

Comments
Please login to add a commentAdd a comment