
మాట్లాడుతున్న జగదీష్ శెట్టర్
హుబ్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ ఫిరాయింపుల పరిణామాలు ఉంటాయని మాజీ సీఎం, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జగదీష్ శెట్టర్ తెలిపారు. గురువారం ఆయన నగరంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలకు ఎలాగైనా అధికారంలోకి రావాలన్నదే ఆశ అని అయితే కర్ణాటకలో అది అధికారాన్ని కోల్పోయిందన్నారు. ఇందుకోసం ఐదు రాష్ట్రాల సీనియర్ నేతలకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చారన్నారు. 80 ఏళ్లు దాటిన సీనియర్ నేతకు టిక్కెట్ ఇచ్చారు. ఈ నియమాలు అందరికి ఒకటే కాదా? అందరికీ వర్తించాలి కదా? అని ఆయన ప్రశ్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు బీజేపీ టికెట్ రాకపోవడానికి కారణం పార్టీ ఇప్పటి వరకు స్పష్టం చేయలేదన్నారు. ధార్వాడ టౌన్ ఇన్‌స్పెక్టర్ కాడదేవరమఠను కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి మందలించడంపై ఆయన జోషిపై మండిపడ్డారు. ప్రజల ముందు బహిరంగంగా ఓ అధికారిని నిందించడం సరికాదన్నారు. కేంద్ర మంత్రి అతని హోదాకు అగౌరవం చూపించినట్టే అని జోషికి హితవు పలికారు. అయినా అధికారి తప్పు చేస్తే కూర్చోబెట్టి కేంద్ర మంత్రి హితవు చెప్పాలి కానీ అందరి ముందు నిందించడం తగదన్నారు. ఒక రౌడీషీటర్‌కు జోషి మద్దతు ఇచ్చారని, దీని వల్ల పోలీస్ వ్యవస్థపై కీలక పరిణామం ఉంటుందన్నారు.