జగిత్యాలక్రైం: కల్లు షాపులపై అధికారుల నియంత్రణ కరువైంది. కొద్దిపాటి కల్లులోనే రసాయనాలు కలిపి భారీగా తయారుచేస్తూ సీసాల్లో నింపి ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. చిన్నారులకు మద్యం విక్రయించవద్దని ఉన్నా అవేమీ పట్టించుకోకుండా కల్లు షాపుల్లో ఇష్టారాజ్యం కొనసాగుతోంది. వారు విక్రయించే కల్లుతో ఎంతోమంది చిన్నారులు, పెద్దలు అస్వస్థతకు గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్‌రోడ్‌లో తండ్రితో కలిసి ఓ నాలుగేళ్ల బాలుడు వచ్చినా నిర్వాహకులు అడ్డుచెప్పలేదు. పైగా అతడికి తండ్రే కల్లు తాగిపించడం గమనార్హం. దీంతో బాలుడే అక్కడే నిద్రమత్తులోకి జారుకున్నాడు. బాలుడు కల్లు తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తండ్రితో కలిసి చిన్నారి కల్లు సేవిస్తున్నా అక్కడి షాపు యజమానులు చూసీచూడనట్లు వ్యవహరించారు. ఇటీవల కల్లు దుకాణాలపై ఎకై ్సజ్ అధికారుల పర్యవేక్షణ కూడా కరువవడంతో ప్రజలకు అనారోగ్యం కలిగించే రసాయనాలు కలిపి కల్లు విక్రయిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని షాపుల్లో మత్తు పెంచేందుకు గుల్ఫారామ్ వంటి పదార్థాలు కలుతున్నా వాటిని పరిశీలించే వారే కరువయ్యారన్న ఆరోపణలు వెల్లువెతుతున్నాయి.
తండ్రితో కలిసి కల్లు తాగిన బాలుడు
కల్లు నిర్వాహకుల ఇష్టారాజ్యం


