ఎకై ్సజ్ స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాత్నం
వైభవంగా కార్తీక దీపారాధన
మాయిశ్చర్ వచ్చినా కొంటలేరు
ఆలయ ఆవరణలో దీపాలు వెలిగిస్తున్న ప్రొఫెసర్ సుజాత
భీమన్న ఆలయం వద్ద దీపాలు వెలిగించిన సమితి సభ్యులు
వేములవాడ: కార్తీకమాసం సందర్భంగా రాజన్న అనుబంధ భీమేశ్వరాలయంలో శ్రీలలితా సేవా ట్రస్టు సభ్యులు, ప్రొఫెసర్ సుజాత శుక్రవారం దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.
వైభవంగా కార్తీక పూజలు
కుంకుమపూజ నిర్వహిస్తున్న భక్తులు
కోడె మొక్కు చెల్లించుకుంటున్న భక్తులు
సుల్తానాబాద్‌రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఓదెల మండలం కొలనూర్ గ్రామానికి చెందిన బోదాసు శ్రీనివాస్(31) శుక్రవారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికుల కథనం ప్రకారం.. శ్రీనివాస్ తన భార్యతో కలిసి ద్విచక్రవాహనంపై సుల్తానాబాద్‌కు వస్తుండగా రేగడిమద్దికుంట గ్రామం వద్ద ఎకై ్సజ్ పోలీసులు తనిఖీ చేశారు. దీంతో అతడి వద్ద గుడుంబా లభించింది. శ్రీనివాస్ అక్కడి నుంచి పారిపోగా భార్యను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. కాసేపటి తర్వాత ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న శ్రీనివాస్.. తాను గతంలోనే జరిమానా చెల్లించానని, మళ్లీ జరిమానా చెల్లించడం తనతో కాదని పోలీసులను వేడుకున్నారు. అయినా, పోలీసులు కేసు నమోదు చేస్తామని తెలిపారు. దీంతో కేసు, జరిమానా భయంతో వెంటతెచ్చుకున్న పురుగులమందు తాగాడు. గమనించిన స్థానికులు, పోలీసులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌లోని మరో ఆసపత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ విషయంపై ఎకై ్స జ్ ఎస్సైని సంప్రదించగా.. కేసు నమోదు కాకుండా బ్లాక్ మెయిల్ చేసేందుకే యువకుడు పురుగులమందు తాగాడన్నారు.
వేములవాడ: రాజన్నను శుక్రవారం 20వేల మంది భక్తులు దర్శించుకున్నారు. కార్తీకమాసం కొనసాగుతుండడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు భీమన్న ఆలయంలో కోడెమొక్కులు, అభిషేకాలు, అన్నపూజలు చెల్లించుకున్నారు.
గుండెపోటుతో రైతు మృతి
మేడిపల్లి(వేములవాడ): వ్యవసాయ పనులు చేస్తుండగా గుండెపోటుతో ర్తెతు మృతిచెందిన ఘటన భీమారం మండలం కమ్మరిపేటలో జరిగింది. వివరాలు.. కమ్మరిపేటకు చెందిన చుక్క రాజేశం (39) ఇటీవల కురిసిన వర్షానికి వరిధాన్యం తడిసిపోగా శుక్రవారం ఆరబెట్టే క్రమంలో ఛాతిలో నొప్పిగా ఉందని కుటుంబీకులకు చెబుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. జగిత్యాల ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
గొర్రెను కాపాడబోయి..
● విద్యుదాఘాతంతో కాపరి మృతి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేట గ్రామ శివారులోని ఇటుకబట్టీలో దాగేటి మల్లేశ్(32) విద్యుదాఘాతంతో దుర్మరణం చెందాడు. ఓ గొర్రె కరెంట్ షాక్‌కు గురికావడంతో దానిని కాపాడబోయిన కాపరి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లేశ్ శుక్రవారం తన గొర్రెలను మేపేందుకు సమీపంలోని ఇటుకబట్టీల నుంచి తీసుకెళ్తున్నాడు. ఈక్రమంలో ఓ గొర్రె విద్యుత్‌షాక్ గురైంది. గమనించిన మల్లేశ్ కాపాడబోయి షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇటుకబట్టీ నిర్వాహకులు తమ అవసరాలకోసం చెట్లపొదల మాటున విద్యుత్ వైర్ వేసి ఉంచడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు. గ్రామ పెద్దలు, యాదవసంఘం నాయకులు ఘటనాస్థలికి చేరుకుని మృతుడి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని యజమానిని డిమాండ్ చేశారు. తమకు ఫిర్యాదు అందలేదని, విచారణ జరుపుతున్నామని రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో ఒకరు..
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతె మాలవాడలో నివాసం ఉంటున్న రాము (17) గురువారం సాయంత్రం అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా గంగాపూర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన రాము, మరికొంత మంది ఉపాధి కోసం వారం క్రితం జగిత్యాలకు వచ్చారు. మోతె మాలవాడలో ఇల్లు అద్దెకు తీసుకుని దగ్గరలోని ఓ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం అందరూ పనికి వెళ్లగా, రాము మాత్రం ఇంట్లో ఉన్నాడు. షాపింగ్‌మాల్‌కు వెళ్లినవారు తిరిగి వచ్చేసరికి రాము వాంతులు చేసుకుని మృతిచెంది ఉన్నాడు. మృతుడి సోదరుడు అజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పదస్థితి మృతిగా కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు.
గుర్తుతెలియని వృద్ధురాలు..
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని శ్రీరాంనగర్‌కాలనీలో గురువారం సాయంత్రం 60–70 ఏళ్ల మధ్య వయస్సు గల గుర్తుతెలియని వృద్ధురాలు మృతిచెందినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. కాలనీలో మృతిచెంది ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ గదిలో భద్రపర్చినట్లు సీఐ పేర్కొన్నారు.
జమ్మికుంటలో..
జమ్మికుంట: జమ్మికుంట రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై ఓ గుర్తు తెలియని మహిళ(50) మృతి చెందింది. రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి వివరాల ప్రకారం.. రైల్వే స్టేషన్‌లో బ్రౌన్ రంగు నైటీ ధరించి ఉన్న గుర్తు తెలియని మహిళ మృతి చెంది ఉంది. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డు, అధారాలు లేవు. మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరిచామన్నారు. వివరాలు తెలిసినవారు 9949304574, 8712658604లకు సంప్రదించాలని సూచించారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
మల్లాపూర్(కోరుట్ల): జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు ప్రతాప్‌రెడ్డి(38) ఆర్థిక ఇబ్బందులతో మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ప్రతాప్‌రెడ్డికి భార్య వర్ష, కుమార్తె ఉన్నారు. ఉపాధి కోసం అప్పు చేసి గల్ఫ్ దేశాలకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో అప్పు రూ.5లక్షలకు చేరుకోవడంతో కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు పేర్కొన్నారు.
పన్ను చెల్లించాలని బెదిరింపు కాల్స్
ధర్మపురి: ధర్మపురి పట్టణ పరిధిలోని ఐదుగురు వ్యక్తులకు గుర్తుతెలియని మోసగాళ్లు ము న్సిపల్ ప న్ను చెల్లించాలని శుక్రవారం బెదిరింపు కాల్స్ చేశా రు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వర కు బాధితుల ఫోన్‌లకు అజ్ఞాత వ్యక్తులు స్కానర్లు పంపిస్తూ రూ.2,500 చెల్లించాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఫోన్‌లో బెదిరించారు. ఆందోళన చెందిన బాధితులు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి అధి కారులకు వివరించారు. ఈ విషయంపై అధికారులు స్పందిస్తూ, ఎవరికి డబ్బులు పంపించవద్దని ప్రకటన విడుదల చేశారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు అధికారులు, బాధితులు సమాచారం ఇవ్వడంతో విచారణ చేపట్టారు. మోసపూరిత కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బెదిరింపు కాల్స్ వస్తే తమ దృష్టికి తీసుకురావాలని పోలీసులు సూచించారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదని మండలంలోని కస్బేకట్కూర్ అనుబంధ చింతలపల్లి గ్రామ రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. వారు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం మాయిశ్చర్ వచ్చినా పై నుంచి ఆదేశాలు రాలేదంటూ వడ్లను కొనడం లేదని మండిపడ్డారు.
ఎకై ్సజ్ స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాత్నం
ఎకై ్సజ్ స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాత్నం
ఎకై ్సజ్ స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాత్నం
ఎకై ్సజ్ స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాత్నం
ఎకై ్సజ్ స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాత్నం
ఎకై ్సజ్ స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాత్నం
ఎకై ్సజ్ స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాత్నం
ఎకై ్సజ్ స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాత్నం
ఎకై ్సజ్ స్టేషన్ ఎదుట యువకుడి ఆత్మహత్యాత్నం


