రేపు ఎస్‌ఆర్ అకాడమీ టాలెంట్ టెస్ట్
విద్యారణ్యపురి : ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడమే లక్ష్యంగా ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12: 45 గంటల వరకు ప్రత్యేక ప్రతిభా పరీక్ష సాట్ క్యూ ఎస్‌ఆర్ అకాడమీ టాలెంట్ టెస్టు నిర్వహించనున్నట్లు ఎస్‌ఆర్ అకాడమీ చైర్మన్ వరదారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ పరీక్ష ఇంటర్మీడియట్‌లో చేరబోయే పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్వహించబోతున్నామని తెలిపారు. పరీక్ష కేంద్రం హనుమకొండలోని ఎస్‌ఆర్ ఎడ్యుసెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ టీచర్స్ కాలనీలో ఏర్పా టు చేసినట్లు తెలిపారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 10వ తరగతి స్థాయిలో మొత్తం 75 ప్రశ్నలు, ప్రతీ సబ్జెక్టుకు 25 మార్కులు ఉంటాయన్నారు. ఐఐటీ–జేఈఈ అండ్ నీట్‌లో కోచింగ్‌లో ప్రవేశం పొందే అర్హత ఉంటుందన్నారు. విద్యార్థులు ఈ పరీక్షతో తమ ప్రతిభను నిరూపించుకోవడంతోపాటు ఉత్తమ స్కాలర్‌షిప్ అవకాశాలను పొందుతారన్నారు. పరీక్ష నమోదు కోసం విద్యార్థులు సమీపంలోని ఎస్‌ఆర్ బ్రాంచ్ లేదా 9642117378, 9154989356, 8886287456, 9154854700, 9642117330, 9642117830, 99642114698 నంబర్లలో సంప్రదించొచ్చని తెలిపారు.


