లభించని వృద్ధుడి ఆచూకీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మానేరు వాగులో గురువారం దూకిన చల్లంగుల కృష్ణయ్య(60) ఆచూకీ శుక్రవారం కూడా లభించలేదు. వృద్ధుడి ఆచూకీ కోసం ఎస్సై ఉపేంద్రచారి ఆధ్వర్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని రంగంలోకి దించారు. అధునాతన బోటు, పరికరాలతో మానేరును జల్లెడపట్టినా జాడ దొరక్కపోవడంతో గాలింపు చర్యలను శనివారం కొనసాగించనున్నట్లు తెలిపారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ప్రమాదం
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో శుక్రవారం రెండోషిఫ్ట్‌లో ప్రమాదం చోటుచేసుకునింది. బ్యాగింగ్ సెక్షన్‌లోని ఖాళీ బ్యాగులను తరలించేందుకు ఉపయోగించే తాడు తెగడంతో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఇటీవల ప్రమాదం జరిగి ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడగా.. చికిత్స చేయిస్తున్నారు. అయితే, కాంట్రాక్టు కార్మికులకు నామమాత్రంగా వైద్యచికిత్స చేయించినా.. తగిన ప్రయోజనాలు కల్పించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎఫ్‌సీఎల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకుడు నీలకంటి రాము డిమాండ్ చేశారు.
పురుగులమందు తాగి వ్యక్తి మృతి
గోదావరిఖని: స్థానిక ప్రశాంత్‌నగర్‌కు చెందిన దాసరి రాజ్‌కుమార్(40) అనే ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుడు క్రిమిసంహారక మందు తాగి శుక్రవారం మృతి చెందాడు. ఇంట్లో క్రిమిసంహారక మందు తాగిన రాజ్‌కుమార్ పరిస్థితి విషమంగా మారడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
లభించని వృద్ధుడి ఆచూకీ


