రైతులకు భారీ పరిహారమివ్వాలి
హుజూరాబాద్‌రూరల్: ఇటీవల సంభవించిన మోంథా తుపాను కారణంగా నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం భారీ పరిహారం అందజేయాలని మల్కాజ్‌గిరి ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి ఆయన హుజూరాబాద్ మండలం జూపాక, రాంపూర్ గ్రామాల్లో పర్యటించారు. తుపాన్ వల్ల దెబ్బతిన్న రోడ్లు, నష్టపోయిన వరి పంటలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా.. తెలంగాణ ప్రభుత్వం ఆవిధంగా వ్యవహరించకపోవడంతో ఎక్కువ నష్టం జరిగిందన్నారు.
పరామర్శ
ఇటీవల వంగర గురుకులంలో ఆత్మహత్యకు పాల్పడిన శ్రీవర్షిత కుటుంబాన్ని ఈటల రాజేందర్ పరామర్శించారు. మాజీ జెడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, జిల్లా నాయకులు బింగి కరుణాకర్, బండి కళాధర్, సంపత్‌రావు, మురాద్, శ్రావణ్ పాల్గొన్నారు.
ఎంపీ ఈటల రాజేందర్


