
స్థానిక సమరంలో కాంగ్రెస్‌దే విజయం
కరీంనగర్‌కార్పొరేషన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై శనివారం నగరంలోని ఇందిరాచౌక్‌లో సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వెనుకబడినవర్గాల డిమాండ్ అయిన 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న కాంగ్రెస్‌కు బీసీలు రుణపడి ఉంటారన్నారు. అయితే రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో బీజేపీ నాయకులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి, ఎండీ తాజ్, గడ్డం విలాస్‌రెడ్డి, మోసిన్, అహ్మద్‌అలీ, పొన్నం శ్రీనివాస్‌గౌడ్, రాచకొండ చక్రధర్‌రావు, విద్యాసాగర్, సతీశ్, కిషన్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బుద్ధుడి బోధనలు అనుసరణీయం
కరీంనగర్‌కల్చరల్: బుద్ధుడి ఆలోచనలు, బోధనలు అనుసరణీమమని సైనిక్ సమత దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాళ్ల వెంకటేశ్ అన్నారు. శనివారం టీఎన్జీవో భవనంలో బుద్ధుడి నాటికను ప్రదర్శించారు. కులనిర్మూలన, సమసమాజం కోసం అంబేడ్కర్ ఎలా కృషి చేశారో కళ్లకు కట్టినట్టు నాటికలో చూపించారు. కార్యక్రమంలో బీఎస్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పరంధాములు, స్టేట్ ఈసీ మెంబర్ మారు సునీల్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలాజీ గైక్వాడ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి లక్ష్మణరావు, రాజేశ్, శ్రవణ్, రోహిత్, నారాయణ, దేవేందర్, రవీందర్, బిక్షపతి తదితరులున్నారు.
బల్దియాకు ఇద్దరు డీఈలు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థకు ఇద్దరు డీఈలు పదోన్నతి బదిలీపై వచ్చారు. ప్రజారోగ్య శాఖలో ఏఈగా ఉన్న దేవేందర్, కోరుట్ల మున్సిపాల్టీలో ఏఈగా పనిచేస్తున్న అరుణ్‌లు డీఈలుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు ఇద్దరు డీఈలను నగరపాలకసంస్థకు కే టాయించారు. కాగా... నగరపాలికలో మొత్తం ఆరు డీఈ పోస్టులు చాలా సంవత్సరాల తర్వాత పూర్తిస్థాయిలో భర్తీ అయ్యాయి. ఇప్పటివరకు నలుగురు డీఈలు లచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, ఓంప్రకాశ్, సంజీవ్‌లు మాత్రమే ఉండగా, ఏఈ అయ్యూబ్‌ఖాన్ ఇన్‌చార్జి డీఈగా వ్యవహరించారు. కాగా అయూబ్‌ఖాన్ ఏఈగా బాధ్యతలు కొనసాగించనున్నారు.
ఏఈలు నలుగురే...
నగరపాలకసంస్థ కార్యాలయంలో పది మంది ఏఈలకు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. మొత్తం పది పోస్టుల్లో ఆరు ఖాళీగా ఉండడంతో క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులపై ప్రభావం పడుతోంది. కీలకమైన ఇంజినీరింగ్ విభాగంలో ఏఈల పోస్టులు కూడా పూర్తిస్థాయిలో భర్తీ చేయాల్సిన అవసరం ఉంది.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు 11 కేవీ ఇరుకుల్ల వ్యవసాయ ఫీడర్ పరిధిలోని ఇరుకుల్ల, నల్లగుంటపల్లి, మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్ రైతులకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.
ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమినరీ ఉచిత శిక్షణ పరీక్షలు
సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిర్వహించిన ఉచిత శిక్షణ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 12నుంచి 2 గంటల వరకు జరిగిన పరీక్షలకు అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డు ఉంటేనే అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అనుమతించారు. 189 మంది హాజరైనట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ తెలిపారు.

స్థానిక సమరంలో కాంగ్రెస్‌దే విజయం

స్థానిక సమరంలో కాంగ్రెస్‌దే విజయం