
ఎల్‌ఎండీలోని జెట్ స్కి స్కూటర్ తరలింపు
● అడ్డుకున్న బీఆర్‌ఎస్ నాయకులు
కరీంనగర్: కరీంనగర్ ఎల్‌ఎండీలోని జెట్ స్కి స్కూటర్‌ను శనివారం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా బీఆర్‌ఎస్ నగరశాఖ అడ్డుకుంది. నాయకులు లేక్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో పర్యాటకశాఖ అధికారులు జెట్ స్కి స్కూటర్‌ను తిరిగి మానేరు నదిలో యథాస్థానానికి చేర్చారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వందల కోట్లతో అభివృద్ధి చేశారన్నారు. మానేరు డ్యామ్‌లో రెండు జెట్ స్కి స్కూటర్లు, స్క్రూఈజ్ బోట్‌ను కొనుగోలు చేసి పర్యాటకులకు అందుబాటులో ఉంచారన్నారు. ప్రస్తుతం మానేరులో నీటి నిలువ డెడ్ స్టోరేజీకి చేరిందని, ప్రభుత్వం స్పందించి డ్యాంను నీటితో నింపాలన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, ఏవీ రమణ, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, మైనార్టీ శాఖ అధ్యక్షుడు మీర్ షాకత్ అలీ, ప్రధాన కార్యదర్శి వాజిద్ హుస్సేన్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు చేతి చంద్రశేఖర్, ఆరె రవి, జల్లోజి శ్రీనివాస్, నారదాసు వసంతరావు, నదీం, ఒడ్నాల రాజు, పటేల్ సుధీర్ రెడ్డి, కొత్త అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.