ట్రాఫిక్‌ నిబంధనలు బేఖాతరు | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ నిబంధనలు బేఖాతరు

Jun 29 2025 2:53 AM | Updated on Jun 29 2025 2:53 AM

ట్రాఫిక్‌ నిబంధనలు బేఖాతరు

ట్రాఫిక్‌ నిబంధనలు బేఖాతరు

రామగుండం: హైదరాబాద్‌ – కరీంనగర్‌ – రామగుండం(హెచ్‌కేఆర్‌) మధ్యగల రోడ్డును రాజీవ్‌ రహదారిగా వ్యవహరిస్తున్నారు. నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ), రాష్ట్రప్ర భుత్వం, కాంట్రాక్టర్‌ సంయుక్త భాగస్వామ్యం(పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్టనర్‌ షిప్‌–పీపీపీ విధానం)లో ఈ రోడ్డు నిర్మించారు. డిజైన్‌, బిల్ట్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ (డీబీఎఫ్‌ఓటీ) మోడల్‌లో దీనికి ఒప్పందం కుదిరింది. నిర్వహణ బాధ్యతలు హెచ్‌కేఆర్‌ రోడ్డు వేస్‌ చేపట్టింది. భారతదేశంలోని మోటారు వాహన చట్టం, 1988, కేంద్ర మోటారు వాహన నియమాలు, 1989లో పేర్కొన్న నిబంధనలు వర్తించనున్నాయి.

హెచ్‌కేఆర్‌ సమగ్ర సమాచారం..

రాజీవ్‌ రహదారి నిర్మాణం కోసం 1995లో ప్రపంచ బ్యాంకు రుణం తీసుకున్నారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచన విధానంతో రెండు లేన్లు, పది మీటర్ల వెడల్పుతో స్టేట్‌ హైవేగా నిర్మించారు. 2011లో పనులు ప్రారంభమై 2013లో పూర్తయ్యాయి. షామీర్‌పేట ఓఆర్‌ఆర్‌ ప్రవేశం నుంచి మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్‌ ఎక్స్‌రోడ్డు హైవే–63కు రాజీవ్‌ రహదారిని అనుసంధానించారు. దీని పొడవు సుమారు 206.85 కి.మీ. 22.5 సంవత్సరాలు నిర్వహణ బాధ్యతలు ఉంటాయి. 2035 వరకు హెచ్‌కేఆర్‌ రోడ్డు నిర్వహణ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.

బాధ్యతలు విస్మరిస్తున్న సంస్థ..

రహదారిపై గతుకులు, పగుళ్లు, శిథిలాలను గుర్తించి సకాలంలో మరమ్మతు చేయడం, ట్రాఫిక్‌ సిగ్న ల్స్‌, రోడ్డుకు ఇరువైపులా సైన్‌బోర్డులు, లైన్‌ మా ర్కింగ్స్‌, జీబ్రా క్రాసింగ్స్‌ ఉండేలా పర్యవేక్షణ చేయ డం, రోడ్డు డివైడర్లు, రిఫ్లెక్టర్లు, హైవే లైటింగ్‌, భద్ర తా సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత హెచకేఆర్‌దే. యాక్సిడెంట్‌ బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి, రోడ్డు ప్రమాదాల నియంత్రణకూ చర్యలు చేపట్టడం, ఎమర్జెన్సీ సర్వీస్‌ (అంబులెన్స్‌, క్రేన్‌ సర్వీస్‌) అందుబాటులో ఉండం ప్రధాన విధి. రహదారి పక్కన పచ్చదనం, చెట్లు నాటడం, రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్వహించడం,వర్షాకాలంలో నీటినిల్వ లేకుండా చూడడం, రహదారి పక్కన విశ్రాంతి స్థలాలు, టా యిలెట్‌ సౌకర్యాలు అందుబాటులో ఉంచాల్సి ఉంది.

రాజీవ్‌ రహదారిపై అస్తవ్యస్తంగా ప్రయాణం

రోడ్డుపై వరద నిలుస్తున్నా పట్టించుకోని వైనం

మూలమలుపుల వద్ద కనిపించని రక్షణ స్తంభాలు

కానరాని హెచ్చరిక బోర్డులు.. తరచూ రోడ్డు ప్రమాదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement