
మారిన రూపురేఖలు
పెరిగిన డివిజన్లు
● ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ● మారిన పాత డివిజన్ల ముఖచిత్రం
కరీంనగర్‌కార్పొరేషన్:
నగరపాలక సంస్థలో 66 కొత్త డివిజన్లను అధికారులు శనివారం ప్రకటించారు. డివిజన్ల పునర్విభజన అనంతరం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీతో కొత్త డివిజన్లను వెల్లడించాల్సి ఉన్నప్పటికి, జాబితాలో జాప్యం జరగడం తెలిసిందే. పాత డివిజన్లు, ముసాయిదాతో పోల్చితే కొత్త డివిజన్ల నెంబర్లు, ఇంటి నెంబర్లలో చేర్పులు, మార్పులు భారీగా చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉంటే తుదిజాబితా అంటూ లీకై న జాబితాలోని కొన్నిడివిజన్ల హద్దులు కూడా మారడం గమనార్హం. పునర్విభజన తుది జాబితాలోనూ తప్పులు దొర్లాయని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
కొత్త డివిజన్లు ఇవే..
నగరానికి ఉత్తరంలో ఉన్న ఆరెపల్లి నుంచి డివిజన్ల పునర్విభజన చేపట్టగా, ఒకటో డివిజన్ ఆరెపల్లిలో ఆరెపల్లి, తీగలగుట్టపల్లిలోని కొంత భాగం కలుపుకొని 4,874 ఓట్లతో డివిజన్ ఏర్పడింది. అలాగే పూర్తిగా తీగలగుట్టపల్లితోనే 5,088 ఓట్లతో రెండో డివిజన్ ఏర్పడగా, 5,249 ఓట్లతో వల్లంపహాడ్, పాత తీగలగుట్టపల్లి, విద్యారణ్యపురి, బుట్టిరాజారాంకాలనీ, అంబేడ్కర్ నగర్‌లోని కొంతభాగంతో మూడో డివిజన్ ఉంది. విలీన గ్రామాలైన గోపాల్పూర్, దుర్శేడ్‌లోని కొంతఏరియా కలిపి 4,997 ఓట్లతో నాలుగో డివిజన్, మరో విలీన ప్రాంతమైన శ్రీపురంకాలనీ, రజ్విచమాన్, రాయల్హోం, చల్మెడ హాస్పిటల్, దుర్శేడ్‌లోని కొంతభాగంతో 5,015 ఓట్లతో ఐదో డివిజన్, పాత బొమ్మకల్, ఆటోనగర్, గుంటూరుపల్లితో కలిపి 4,920 ఓట్లతో ఆరో డివిజన్‌ను ఏర్పాటు చేశారు. పూర్తిగా హౌసింగ్‌బోర్డు కాలనీ, సదాశివపల్లితో ఏడో డివిజన్‌ను 5,207 ఓట్లతో మార్చారు. గతంతో పోల్చితే ప్రస్తుతం కాలనీ మొత్తం ఒకే డివిజన్‌లోకి వచ్చింది. ఇక పూర్తి అలుగునూరుతో 5,697 ఓట్లతో 8వ డివిజన్, కోతిరాంపూర్, అలకాపురికాలనీ, హనుమాన్‌నగర్ కలిపి 4,763 ఓట్లతో 9వ డివిజన్, కట్టరాంపూర్, తిరుమల్‌నగర్, గౌతమినగర్ కొంతభాగం కలిపి 5,078 ఓట్లతో 10వ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. కట్టరాంపూర్, గౌతమినగర్, రామచంద్రాపూర్ కాలనీల్లోని ప్రాంతాలను కలుపుకొంటూ 5,457 ఓట్లతో 11వ డివిజన్, రామచంద్రాపూర్‌కాలనీ, హస్నాపూర్, సప్తగిరికాలనీ, భగత్నగర్లలోని ప్రాంతాలను కలుపుతూ 5,338 ఓట్లతో 12వ డివిజన్, సప్తగిరికాలనీ, ప్రగతినగర్, శివనగర్, మార్కండేయనగర్ ప్రాంతాలను కలుపుతూ 5,339 ఓట్లతో 13వ డివిజన్, విలీనగ్రామం చింతకుంట, గాంధీనగర్, పాత పద్మనగర్‌లోని కొంతప్రాంతాన్ని కలుపుతూ 4,658 ఓట్లతో 14వ డివిజన్, పూర్తిగా చింతకుంటతో 5,174 ఓట్లతో 15వ డివిజన్, మల్కాపూర్, లక్ష్మీపూర్లు కలిపి 4,212 ఓట్లతో 16వ డివిజన్, కొత్తపల్లిలోని సగ భాగంతో 5,427 ఓట్లతో 17 డివిజన్, కొత్తపల్లి మిగతా సగభాగంతో 5,245 ఓట్లతో 18వ డివిజన్, రేకుర్తిలోని 5,166 ఓట్లతో 19వ డివిజన్, రేకుర్తి ఓట్లు 5,455 తో 20వ డివిజన్ ఏర్పాటు చేశారు. కొత్తయాస్వాడ, రేకుర్తిలోని కొంతభాగంతో కలిపి 5,326 ఓట్లతో 21, కొత్తయాస్వాడ, హిందుపురి కాలనీ,జగిత్యాల రోడ్, చైతన్యపురి, జ్యోతినగర్ కొంతభాగంతో కలిపి 5,200 ఓట్లతో 22వ డివిజన్, సీతారాంపూర్, మెహర్నగర్లను కలిపి 4,786 ఓట్లతో 23వ డివిజన్, మెహర్నగర బ్యాంక్ కాలనీ, సుభాష్‌నగర్ కొంతభాగంతో 5,251 ఓట్లతో 24వ డివిజన్, సుభాష్‌నగర్, బుట్టిరాజారాం ప్రాంతాలను కలిపి 4,945 ఓట్లతో 25వ డివిజన్, ఆదర్శనగర్, సుభాష్‌నగర్ ప్రాంతాలతో 5,027 ఓట్లతో 26వ డివిజన్, శర్మనగర్, అంబేడ్కనగర్ కొంతభాగం, కార్ఖానగడ్డ, గాంధీరోడ్లలోని 4,698 ఓట్లతో 27వ డివిజన్, తీగలగుట్టపల్లి, కిసాన్‌నగర్ ప్రాంతాల్లోని 4,955 ఓట్లతో 28వ డివిజన్, కిసాన్‌నగర్‌లోని 4,879 ఓట్లతో 29వ డివిజన్, కిసాన్‌నగర్, ఖాన్పుర, దుర్గమ్మగడ్డ, కార్ఖానగడ్డ, గాంధీరోడ్‌లోని 5,448 ఓట్లతో 30వ డివిజన్ ఏర్పడింది. ఖాన్పుర, దుర్గమ్మగడ్డలోని 5,364 ఓట్లతో 31వ డివిజన్, హుస్సేనిపురలోని 5,273 ఓట్లతో 32, హుస్సేనిపురలోని 5,050 ఓట్లతో 33వ డివిజన్, కృష్ణానగర్, మధురానగర్, విజయనగర్‌కాలనీ, సలాఫీనగర్ల్లోని 5,059 ఓట్లతో 34వ డివిజన్, కాపువాడ, మారుతినగర్, హుస్సేనిపురల్లోని 4,765 ఓట్లతో 35వ డివిజన్, కాపువాడ, మారుతినగర్ల్లోని 5,195 ఓట్లతో 36వ డివిజన్, షాహబ్స్ట్రీట్లోని 5,417 ఓట్లతో 37వ డివిజన్, గాయత్రినగర్, అమీర్‌నగర్, లక్ష్మీనగర్ల్లోని 4,849 ఓట్లతో 38వ డివిజన్, కోతిరాంపూర్, అలకాపురికాలనీల్లోని 4,744 ఓట్లతో 39, కట్టరాంపూర తిరుమల్‌నగర్, గణేష్‌నగర్, హనుమానగర్ల్లోని 4,903 ఓట్లతో 40వ డివిజన్ ఏర్పాటు చేశారు. కట్టరాంపూర్, గౌతమినగర్, భగత్నగర్ల్లోని 4,851 ఓట్లతో 41వ డివిజన్, భగత్‌నగర్‌లోని 5,239 ఓట్లతో 42వ డివిజన్, గోదాంగడ్డ, శ్రీనగర్ కాలనీల్లోని 5,344 ఓట్లతో 43వ డివిజన్, శ్రీనగర్‌కాలనీ, సప్తగిరికాలనీల్లోని 5,392 ఓట్లతో 44వ డివిజన్, మంకమ్మతోటలోని 5043 ఓట్లతో 45వ డివిజన్, రాంనగర్, ప్రగతినగర్ల్లోని 4,968 ఓట్లతో 46వ డివిజన్, రాంనగర్, మంకమ్మతోట, సంతోష్నగర్ల్లోని 5,225 ఓట్లతో 47వ డివిజన్, రాంనగర్, సంతోష్‌నగర్, విద్యానగర్ల్లోని 5,110 ఓట్లతో 48వ డివిజన్, జ్యోతినగర్, రాంనగర్, సంతోష్నగర్ల్లోని 4,789 ఓట్లతో 49వ డివిజన్, జ్యోతినగర్, చైతన్యపురి, భాగ్యనగర్ల్లోని 5,193 ఓట్లతో 50వ డివిజన్ ఏర్పాటైంది. వావిలాలపల్లిలోని 5102 ఓట్లతో 51వ డివిజన్, డాక్టర్స్ స్ట్రీట్, వావిలాలపల్లిల్లోని 5,442 ఓట్లతో 52వ డివిజన్, కార్ఖానగడ్డ, గాంధీరోడ్, శర్మనగర్, సాహెత్నగర్ల్లోని 4,826 ఓట్లతో 53వ డివిజన్, అశోక్‌నగర్, కార్ఖానగడ్డ, గాంధీరోడ్ల్లోని 5,034 ఓట్లతో 54వ డివిజన్, కాపువాడ, మారుతినగర్ల్లోని 5,055 ఓట్లతో 55వ డివిజన్, షాహబ్స్ట్రీట్, సిక్వాడీ, బోయవాడల్లోని 5,028 ఓట్లతో 56వ డివిజన్, గణేశ్‌నగర్, ధోబీవాడ, గంజ్ ఏరియా, మార్కెట్ ఏరియా, తిరుమల్నగర్ల్లోని 4,772 ఓట్లతో 57వ డివిజన్, సిక్వాడీ, బోయవాడ, లక్ష్మీనగర్, గణేశ్‌నగర్, స్టేడియంరోడ్డు, ముకరాంపురల్లోని 4,987 ఓట్లతో 58వ డివిజన్, ముకరాంపురలోని 4,711 ఓట్లతో 59వ డివిజన్, మంకమ్మతోట, కాశ్మీర్‌గడ్డ, రైతుబజార్, మహిళా కళాశాల ప్రాంతాల్లోని 5,236 ఓట్లతో 60వ డివిజన్, మంకమ్మతోటలోని 5,595 ఓట్లతో 61వ డివిజన్, మంకమ్మతోటలోని 4,927 ఓట్లతో 62వ డివిజన్, జ్యోతినగర్‌లోని 5,044 ఓట్లతో 63వ డివిజన్, ముకరాంపుర, జ్యోతినగర్ల్లోని 4,754 ఓట్లతో 64వ డివిజన్, డాక్టర్స్స్ట్రీట్, అజ్మత్పుర, ఆదర్శనగర్, సుభాష్‌నగర్, కార్ఖానగడ్డ, గాంధీరోడ్ల్లోని 5,156 ఓట్లతో 65వ డివిజన్, టవర్ సర్కిల్, తిలక్‌నగర్, శాసీ్త్రరోడ్, వీక్లీమార్కెట్ల్లోని 5,276 ఓట్లతో 66వ డివిజన్‌ను ఏర్పాటు చేశారు.