
అంబేడ్కర్ ఆలోచనలు స్ఫూర్తిదాయకం
మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
కరీంనగర్: అంబేడ్కర్ ఆలోచన విధానం ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధన దిశగా ప్రభుత్వం పని చేస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం కరీంనగర్‌లోని కోర్టు చౌరస్తాలో అంబేడ్కర్ 134వ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి, కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్, అదనపు కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్, తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజ్జెల కాంతం, ప్రజాసంఘాల నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, సామాజిక సాధికారత దిశగా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోందని తెలిపారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ, అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ ప్రఫుల్‌దేశాయ్ మాట్లాడుతూ, ప్రపంచస్థాయిలో మన దేశం పేరు నిలిచిపోయేలా చేసిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పేయ్ మాట్లాడుతూ, 70 ఏళ్ల తర్వాత కూడా దేశ పౌరులంతా ఐక్యంగా ఉన్నారంటే అందుకు అంబేడ్కర్ రచనలే కారణ మన్నారు. జయంతోత్సవ కమిటీ చైర్మన్ కొండ్ర స్వరూప అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి పవన్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, జయంతోత్సవ కమిటీ, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
న్యూస్‌రీల్

అంబేడ్కర్ ఆలోచనలు స్ఫూర్తిదాయకం

అంబేడ్కర్ ఆలోచనలు స్ఫూర్తిదాయకం

అంబేడ్కర్ ఆలోచనలు స్ఫూర్తిదాయకం

అంబేడ్కర్ ఆలోచనలు స్ఫూర్తిదాయకం