ఎలుగుబంటి దాడిలో ఒకరికి గాయాలు
హుజూరాబాద్: కాట్రపల్లి గ్రామంలో ఆదివారం ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. ఎలుగుబంటి దాడిలో ఓ యువకుడు సైతం గాయపడ్డాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాణాల హరీశ్ అనే యువకుడు ఉదయం బహిర్భూమికి వెళ్లగా.. ఎలుగుబంటి అకస్మాతుగా వచ్చి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. హరీశ్‌ను జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజులుగా ఎలుగుబంటి సంచరిస్తోందని అటవీ శాఖాధికారులకు చెప్పినా వచ్చి వెళ్లారే తప్ప చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఎలుగుబంటిని వెంటనే పట్టుకోవాలని వేడుకుంటున్నారు.


