కానిస్టేబుల్‌ను పరామర్శించిన సీపీ | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ను పరామర్శించిన సీపీ

Mar 24 2025 6:10 AM | Updated on Mar 24 2025 6:09 AM

కరీంనగర్‌క్రైం: బీఆర్‌ఎస్‌ బైక్‌ ర్యాలీలో బుల్లెట్‌ ఢీకొని చికిత్స పొందుతున్న మహిళా కానిస్టేబుల్‌ పద్మజను ఆదివారం సాయంత్రం కరీంనగర్‌ సీపీ గౌస్‌ ఆలం పరామర్శించారు. ఆమె చికిత్స వివరాలు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అన్ని రకాలుగా తోడుంటామని హామీ ఇచ్చారు. సీపీ వెంట రూరల్‌ ఏసీపీ శుభమ్‌ప్రకాష్‌, ఇన్‌స్పెక్టర్లు బిల్లా కోటేశ్వర్‌, ప్రదీప్‌కుమార్‌ ఉన్నారు.

వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యవర్గం

కరీంనగర్‌స్పోర్ట్స్‌: వ్యాయామ ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం టీఎన్జీవో సమావేశ మందిరంలో ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా గంగాధర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పీడీ బాబు శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా తాడికల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పీడీ ఆడెపు శ్రీనివాస్‌ ఎన్నికయ్యారు. మొత్తం 68 మంది సంఘం సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోగా బాబు శ్రీనివాస్‌ 6 ఓట్ల తేడాతో అంతడ్పుల శ్రీనివాస్‌పై, ఆడేపు శ్రీనివాస్‌ 10 ఓట్ల తేడాతో ఎండీ యూనిష్‌పాష పై విజయం సాధించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తిగౌడ్‌ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగగా నల్గొండ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు చంద్రయ్య ఎన్నికల పరిశీలకులుగా, పెద్దపెల్లి జిల్లా ఫిజికల్‌ డైరెక్టర్‌ కడారి రవి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎన్నికై న అధ్యక్ష కార్యదర్శులను పెటా సంఘం రాష్ట్ర, జిల్లా బాధ్యులు, పీఈటీలు, పీడీ అభినందించారు.

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ఉద్యమిస్తాం

కరీంనగర్‌: స్వాతంత్ర సమరయోధులు, దేశం కోసం ఉరికంబాన్ని సైతం చిరునవ్వుతో ముద్దాడిన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల స్ఫూర్తితో ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్‌ నుంచి బస్టాండ్‌ వరకు పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా పోరాటాల ద్వారానే పీడిత ప్రజలకు దోపిడీ పీడనల నుంచి విముక్తి లభిస్తుందన్న భగత్‌సింగ్‌ స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. నాయకులు గిట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, బీమాసాహెబ్‌, కోనేటి నాగమణి, గజ్జెల శ్రీకాంత్‌, కంపెళ్ళి అరవింద్‌, తిరుపతినాయక్‌, వినయ్‌సాగర్‌, రఘుపతి, ఇసాక్‌, శ్రీనివాస్‌, పిల్లి రవి, తిప్పారపు సురేశ్‌, ఆకాశ్‌, అంజి, రాకేశ్‌, మోహన్‌, సందేశ్‌, రంజిత్‌, ప్రణీత్‌ తదితరులు పాల్గొన్నారు.

అడువాల సుజాతకు పురస్కారం

కరీంనగర్‌కల్చరల్‌: జిల్లాకు చెందిన రచయిత్రి, సామాజిక సేవకురాలు, రుద్రమ సాహితీ స్రవంతి మహిళా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్‌ అడువాల సుజాత రాష్ట్రస్థాయి మహిళాశక్తి పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ పాలమూరు, ప్రమీల శక్తి పీఠం హైదరాబాద్‌ వారు సంయుక్తంగా ఆదివారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించే కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య మసన చెన్నప్ప, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్‌ నామోజు బాలాచారి, తెలంగాణ మహిళా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు డాక్టర్‌ రావూరి వనజ తదితరుల చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా సుజాతకు పలువురు కవులు, రచయితలు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement