
ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి
హుజూరాబాద్: పర్యావరణ పరిరక్షణ, వాతావరణ కాలుష్య నివారణకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం హుజూరాబాద్ పట్టణంలోని అల్ఫోర్స్ జీనియస్ ఇంగ్లిష్ మీడియం స్కూ ల్లో ఇందిర వన ప్రభ కార్యక్రమంలో భాగంగా మొ క్కలు నాటారు. పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. వాటిని ఇంటి ముందు నాటి, సంరక్షించాలని సూ చించారు. మొక్కల పెంపకంతోనే మానవాళి మనుగడ సాధ్యమని, సకాలంలో వర్షాలు కురుస్తాయని, స్వచ్ఛమైన గాలి ఇస్తాయని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో హెచ్‌ఎం, టీచర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
అట్టహాసంగా ‘అల్ఫోర్స్ ఎక్సెల్’
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే సోమవారం అట్టహాసంగా సాగింది. ‘అల్ఫోర్స్ ఎక్సెల్’ పేరిట స్థానిక ఓ ఫంక్షన్‌హాల్లో నిర్వహించిన వేడుకలను విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి, ప్రారంభించారు. జూనియర్స్‌కు స్వాగతం పలుకుతూ సీనియర్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించి, చక్కటి ప్రణాళికతో విద్యాభ్యాసం సాగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది ఉన్నారు.

ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలి