
ధర్నా చేస్తున్న వైఎస్సార్‌టీపీ నాయకులు
చొప్పదండి: వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల హౌస్ అరెస్టుకు నిరసనగా చొప్పదండి మండలంలోని ఆర్నకొండలో వైఎస్సార్ విగ్రహం ఎదుట ఆ పార్టీ జిల్లా నాయకుడు తడగొండ సత్యరాజ్‌వర్మ, పట్టణ శాఖ అధ్యక్షుడు గుర్రం మధుకర్ రెడ్డిల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సత్యరాజ్‌వర్మ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నవారిని పరామర్శించేందుకు వెళ్తున్న షర్మిలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం హౌస్ అరెస్టు చేయించడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకునే, ప్రజా సమస్యలపై పోరాడే హక్కు ఉందని బీఆర్‌ఎస్ నాయకులు గుర్తించడం లేదన్నారు. అక్రమ కేసులు బనాయించి, షర్మిలను నిలువరించాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. కార్యక్రమంలో రామడుగు మండల శాఖ అధ్యక్షుడు దాసరి రవిశాస్త్రి, నాయకులు పాల్గొన్నారు.
బొగ్గు సకాలంలో రవాణా చేస్తేనే లాభాలు
గోదావరిఖని(రామగుండం): ఉత్పత్తి చేసిన బొ గ్గును సకాలంలో రవా ణా చేస్తేనే సింగరేణికి లాభాలు వస్తాయని ఆర్జీ–1 జీఎం కె.నారా యణ అన్నారు. మంగళవారం జీడీకే–1, 3 గని వద్ద 45 టన్నుల బొగ్గు నిల్వ చేసే సామర్థ్యం గల కోల్ బంకర్‌ను ఆయన ప్రారంభించారు. గ్రేడ్‌ల ప్రకారం బొగ్గు నిల్వ చేసేందుకు ఈ బంకర్‌ను నిర్మించామన్నారు. ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌రావు, అధికారులు పొనగోటి శ్రీనివాస్, రామ్మోహన్, బానోతు సైదులు, రమేశ్‌బాబు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
