
రవి
కరీంనగర్ స్పోర్ట్స్: తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి ఎన్నుకున్నారు. ఇందులో కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరికి చోటు దక్కింది. గతంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేసిన జిల్లా అధ్యక్షుడు నందెల్లి మహిపాల్ ఈసారి కూడా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అలాగే జిల్లా కార్యదర్శి కడారి రవిని రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా నియమించారు. వీరి ఎంపిక పట్ల అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు హరికిషన్, రాజ గోపాలచారి, కటకం రవి, చంద్రశేఖర్, ఉనుక లక్ష్మణ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

మహిపాల్