
గోదావరిఖని(రామగుండం): సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 జీఎంగా పనిచేస్తూ ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్న కె.నారాయణను సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో డైరెక్టర్లు ఘనంగా సన్మాని ంచారు. జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు బలరాం, సత్యనారాయణరావు, ఎన్‌వీకే శ్రీనివాస్, వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
నర్సరీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
రామగిరి(మంథని): సింగరేణిలో పని చేస్తున్న నర్సరీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న డిమాండ్ చేశారు. సోమవారం ఫారెస్ట్రీ డీజీఎం బానోతు కర్ణాకు వినతిపత్రం అందించి, మాట్లాడారు. నర్సరీ కార్మికులకు కనీస వేతనం, బోనస్, పీఎఫ్, వైద్యం, చట్టబద్ధ హ క్కులు అమలు చేయాలని కోరారు. కొన్నేళ్లుగా కాంట్రాక్ట్ కార్మికులుగా గుర్తింపు లేకుండా అడ్డా మీద లేబర్లుగా పని చేస్తున్నారని అన్నారు. వారి న్యాయమై న హక్కుల సాధన కోసం ఐఎఫ్‌టీయూ పోరాట ఫలితంగా సింగరేణి యా జమాన్యం ముందుకు వచ్చి, సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చిందని పేర్కొన్నారు. కొత్తగా పిలిచిన టెండర్‌లో కార్మికులకు చెందాల్సిన హక్కులు, సౌకర్యాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.