
ఉత్పత్తులను పరిశీలిస్తున్న జీఎం మనోహర్
గోదావరిఖని(రామగుండం): సింగరేణి మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆర్జీ–2 జీఎం ఎ.మనోహర్ అన్నారు. సోమవారం వృత్తి విద్య కోర్సుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం నిర్వహించిన టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు పూర్తవగా వారు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. ఏరియాలో మూడు సెంటర్ల ద్వారా టైలరింగ్‌లో 108 మందికి, మగ్గం వర్క్‌లో 35 మందికి, బ్యూటీషియన్‌లో 72 మంది, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో 56 మంది మహిళలకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. దీన్ని సద్వినియోగం చేసుకొని, రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు సింగరేణి తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు సవిత, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, అధికారులు అనిల్‌కుమార్, శ్రీనివాస్, సేవా కో–ఆర్డినేరట్ దేవారెడ్డి, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.