
అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్‌కు వినతిపత్రం ఇస్తున్న నాయకులు
కరీంనగర్: ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములను వ్యవసాయం చేసుకోవడానికి పేద దళిత రైతులకు లీజుకు ఇవ్వాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్‌ను కలిసి, వినతిపత్రం అందించారు. ఏఐఎఫ్‌బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ.. కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూరులో సర్వే నంబర్ 383, 438, 439, 443, 549, 550, 581, 584, 442, బొమ్మకల్‌లోని సర్వే నంబర్ 113, 114, 115లలో ఉన్న భూములను ప్రభుత్వం 2006 స్వాధీనం చేసుకుందన్నారు. వాటిని పేద దళితులకు వ్యవసాయానికి లీజుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోర్టులో సీలింగ్ కేసు పెండింగ్‌లో ఉండగా ఆయా సర్వే నంబర్లలోని భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు చేసి, విక్రయిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటివరకు జరిగిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కోరామన్నారు. కోర్టు లీజుకు ఇవ్వాలని చెప్పినప్పటికీ ఇవ్వకపోవడానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. సదరు భూముల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు, కోర్టులో సీలింగ్ కేసు పెండింగ్‌లో ఉందనే పేరుతో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జి.ప్రశాంత్ కుమార్, నాయకులు బద్రి నేత, రమేశ్, రామ్మూర్తి, అరుణ్, కొమురయ్య, శంకరయ్య, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల విషయంలో
ఏఐఎఫ్‌బీ డిమాండ్
రియల్ ఎస్టేట్ వ్యాపారులు విక్రయిస్తున్నారని ఆరోపణ
ప్రజావాణిలో నాయకుల ఫిర్యాదు