
కరీంనగర్: పోషక విలువలున్న చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నా రు. పోషణ అభియాన్–పోషణ్ పక్వాడ పక్షోత్సవా ల్లో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఆవరణలో చిరుధాన్యాల మేళా నిర్వహించారు. దీన్ని మంత్రి ప్రార ంభించారు. ప్రదర్శనలో ఉంచిన స్టాళ్లను పరిశీలించారు. మన పూర్వీకులు తృణధాన్యాలను మాత్రమే ఆహారంగా తీసుకున్నారని, అందువల్లే వాళ్లు 100 ఏళ్లు బీపీ, షుగర్ వంటి వ్యాధులు లేకుండా జీవించారని చెప్పారు. ప్రస్తుతం పురుగు మందుల వాడ కం ఎక్కువైనందున మనం తినే ఆహారం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని పేర్కొన్నారు. తృణధాన్యాలైన కొర్రలు, సామలు, ఊదలు వంటివి భోజనంలో తీసుకోవాలని సూచించారు. స్టాళ్లను చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, మానకొండూర్ ఎమ్మెల్యే బాలకిషన్, జెడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావులు పరిశీలించారు. అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్, ఉట్నూరు ఐటీడీఏ సభ్యులు, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం, అంగన్‌వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. సుమారు 150 రకాల మిల్లెట్స్‌తో చేసిన ఆహార పదార్థాలను ప్రదర్శించారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, జెడ్పీ సీఈవో ప్రియాంక, అసిస్టెంట్ కలెక్టర్ లెనిన్, ట్రైనీ కలెక్టర్ నవీన్, జిల్లా సంక్షేమ అధికారి సబితాకుమారి, అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్
కలెక్టరేట్ ఆవరణలో అంతర్జాతీయ మిల్లెట్ మేళా ప్రారంభం