
అధికారులతో మాట్లాడుతున్న జీఎం గురువయ్య
గోదావరిఖని(రామగుండం): అనుక్షణం రక్షణతో విధులు నిర్వహిస్తూ నిర్ధేశిత లక్ష్యాలను సాధించాలని కార్పొరేట్ సేఫ్టీ జీఎం గురువయ్య అన్నారు. సోమవారం ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1లో ఆయన పర్యటించారు. ఆఫ్‌లోడింగ్ క్వారీలోని పని స్థలాలను, ప్రాజెక్టు విస్తరణ పనులను, తీసుకుంటున్న రక్షణ చర్యలను పరిశీలించారు. ఓసీపీల్లో ఎండాకాలం సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రామగుండం రీజియన్ సేఫ్టీ జీఎం ఎస్.సాంబయ్య, ఏరియా జీఎం టీవీరావు, ప్రాజెక్టు అధికారి ఎన్.రాధాకృష్ణ, ఏరియా రక్షణ అధికారి సీహెచ్.వెంకటరమణ, ప్రాజెక్టు ఇంజినీర్ ఆర్.శ్రీనివాస్, మేనేజర్ ఉదయ్‌హరిజన్, రక్షణ అధికారి కోటయ్య తదితరులున్నారు.