
మాట్లాడుతున్న చైర్మన్ వెంకటరెడ్డి
సైదాపూర్(హుస్నాబాద్): ధాన్యం కొనుగోళ్లతో సహకార సంఘం ఆర్థికాభివృద్ధి చెందుతుందని వెన్నంపల్లి సహకార సంఘం చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహజన సభ చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లతో రూ.కోటివరకు కమీషన్ రూపంలో సంఘానికి నిధులు సమకూరాయని తెలిపారు. ఇప్పటికే సంఘం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, గోదాం నిర్మాణం పూర్తికాగా ఎగ్లాస్‌పూర్‌లో గోదాం, వెన్నంపల్లిలో సహకార సంఘం నూతన భవనాలకు భూమిపూజ చేసినట్లు చెప్పారు. ఏటా వందశాతం రుణాల వసూళ్లతో సంఘానికి మంచి గుర్తింపు ఉందని, అందుకు ఏటా రూ. 50వేలు బహుమతిగా వస్తున్నట్లు తెలిపారు. వైస్ చైర్మన్ శ్రీనివాస్, సర్పంచులు రాజిరెడ్డి, పాపయ్య, చిరంజీవి, ఎంపీటీసీ విజయ, డైరెక్టర్లు, సీఈవో మల్లారెడ్డి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.