
చింతకుంటలో సర్వే చేస్తున్న వలంటీర్లు
కొత్తపల్లి: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బతుకు పాట లది కీలక పాత్ర అని తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజోజు నాగభూషణం అన్నారు. కొత్తపల్లి మండలంలోని చింతకుంటలో ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల జాతీయ సేవా పథకం–3 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిబిరంలో భాగంగా మూడో రోజు ఆదివారం మేధోమదన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఉద్యమంలో అసువులు బాసిన అమరులను స్మరి స్తూ పాటలు పాడారు. అంతకముందు వలంటీర్లు యువత ఉపాధిపై సర్వే నిర్వహించారు. 15 నుంచి 29 ఏళ్ల వయసు గలవారి అక్షరాస్యత, ఉపాధి అవకాశాలపై 33 ప్రశ్నలతో వివరాలు సేకరించారు. ఓటర్ కార్డు, రేషన్ కార్డు, వ్యక్తిగత మరుగుదొడ్డి, ఆసరా పెన్షన్, రైతుబంధు, ఇంకుడు గుంత తదితర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. కరోనా, ఎయిడ్స్ వ్యాధులపై అవగాహనతోపాటు 100, 101, 108 ప్రభుత్వ సర్వీస్ నంబర్ల సమాచారాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో డాక్టర్ ఎస్.ఓ.ఎస్.కుమార్, గాయకుడు రావుల పవన్, ప్రోగ్రాం అధికారి వి.వరప్రసాద్, హెచ్‌ఎం ఎం.నారాయణస్వామి, యాద వ సంఘం అధ్యక్షుడు రేణయ్య, వలంటీర్లు, గ్రామస్తులు పాల్గొనారు.
తెలంగాణ రచయితల వేదిక
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగభూషణం