
హుజూరాబాద్ రూరల్ : పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో ఆదివారం సీపీఆర్ (కార్డియో పల్మనరీ రెస్పిరేషన్)పై పోలీస్ సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారన్నారు. అనంతరం సీపీఆర్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యులు వివరించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజేందర్, వైద్యులు సురేశ్, నారాయణరెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు.
‘మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం’
రామడుగు(చొప్పదండి) : మండలంలోని రాంచంద్రాపూర్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు ఈరెల్లి శేఖర్ ప్రమాదశాత్తు మృతిచెందగా ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. శేఖర్ కుటుంబ సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మృతుడి కుమారుడు స్వాతిక్‌కు పాఠశాల ఫీజుతో పాటుగా అన్ని విఽ దాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు.