
సీపీ సుబ్బారాయుడికి కిట్ అందిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు (ఫైల్)
కరీంనగర్ క్రైం: తరగతి గదికి పరిమితమై, నిత్యం పుస్తకాలతో కుస్తీ పడుతూ చదువుపైనే ధ్యాస పెట్టే విద్యార్థులు ఇతరులకు చేయూతనివ్వాలని భావించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్స అందక చాలా మంది ఇబ్బంది పడుతున్న విషయమై ఆలోచించారు. వారికి సమయానికి ప్రథమ చికిత్స అందించాలని నిర్ణయానికి వచ్చారు ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సై న్స్ అటానమస్ కళాశాల కెమిస్ట్రీ విభాగం విద్యార్థులు. తమ సొంత ఖర్చులతో కరీంనగర్‌లోని ప్రధాన కూడళ్లలో ప్రథమ చికిత్స కిట్లను ఏర్పా టు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విష యం సీపీ ఎల్.సుబ్బారాయుడు దృష్టికి తీసుకెళ్లగా వారి ఆలోచనకు శభాష్ అని మెచ్చుకున్నారు.
20 వరకు ప్రదేశాల్లో..
కరీంనగర్‌లోని ఎన్టీఆర్ చౌరస్తా, కమాన్ చౌరస్తా, బస్టాండ్, తెలంగాణ చౌక్, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ చౌరస్తా, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ చౌరస్తా, నాఖా చౌరస్తాతోపాటు నగరంలోని సుమారు 20 వరకు ప్రదేశాల్లో మెడికల్ కిట్ల ఏర్పాటుకు విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారు. ఆయా కూడళ్లలో ఉండే ట్రాఫిక్ పోలీసులకు వాటిని అందిస్తున్నారు. ఒక్కో కిట్‌లో హైడ్రోజన్ పెరాకై ్సడ్, అయోడిన్, పెయిన్ రిలీఫ్ స్ప్రే, పారాసిటమాల్ టాబ్లెట్లు, బ్యాండేజ్, కాటన్, ఓఆర్‌ఎస్, కత్తెరతోపాటు ప్రథమ చికిత్సకు అవసరమయ్యే పలు వస్తువులు అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థి దశలో తమ పాకెట్ మనీతో ఇతరులకు సహాయం చేయాలనే వారి మంచి మనసును అందరూ అభినందిస్తున్నారు.
రోజూ ప్రమాదాలు..
నగరంలో రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయి. బాధితులకు గాయాలవడం, వారు ఆసుపత్రికి వెళ్లేసరికి ఆలస్యం కావడం చూశాం. మా లెక్చరర్స్ సూచనల మేరకు ప్రథమ చికిత్స కిట్ ఏర్పాటు చేయాలనుకున్నాం. – కె.సౌమ్య, విద్యార్థిని
కొందరికి మేలు జరిగినా సంతోషమే
కరీంనగర్‌లో సుమారుగా 20 వరకు కూడళ్లలో మేము ఫస్ట్ ఎయిడ్ కిట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మా ఆలోచన ద్వారా కొందరికి మేలు జరిగినా మాకు సంతోషంగా ఉంటుంది.
– గ్రీష్మ, విద్యార్థిని
ఇతరులకు సహాయపడాలి
ఇతరులకు మనకు తోచిన విధంగా సహాయపడాలని మా లెక్చరర్లు చెబుతుంటారు. ఈ క్రమంలో ఏం చేద్దామని అనుకుంటుండగా ప్రథమ చికిత్స కిట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది.
– వినయ్, విద్యార్థి
పాకెట్ మనీతో..
ప్రమాదాలు జరిగినప్పుడు సరైన సమయంలో ప్రథమ చికిత్స అందక బాధితులు ఇబ్బందులు పడుతుండటం చూశాం. మా పాకెట్ మనీతో మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం.
– బి.అనిల్, విద్యార్థి
ప్రధాన కూడళ్లలో ఏర్పాటు సన్నాహాలు
వాహనదారులకు
ఆపదలో అండగా ఉండేందుకే..
ట్రాఫిక్ పోలీసులకు అందజేత
ఎస్సారార్ కళాశాల
విద్యార్థుల ఔదార్యం

ఫస్ట్ ఎయిడ్ కిట్‌తో కెమిస్ట్రీ విద్యార్థినులు



