
మత్స్యకారులు లక్షాధికారులు కావాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): మత్య్సకారులు లక్షాధికారులు కావడానికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్ అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని రైతు వేదికలో మాట్లాడారు. చేపలు పట్టే హక్కు ముదిరాజ్‌లు, బెస్తవారికి మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో 6,000 మత్స్య సంఘాల్లో 4,500 మత్య్స సంఘాలు ముదిరాజ్‌లవే కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ముదిరాజ్‌లు హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. సభ్యత్వం లేని గ్రామాల్లో సభ్యత్వం సాధించుకోవాలన్నారు. మత్య్సకారులు మరింత అభివృద్ధి సాధించాలంటే నేడు ఆవిష్కరించిన పుస్తకం చదవాలన్నారు. ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు బట్టు విఠల్, డాక్టర్ నిజ్జన రమేశ్ ముదిరాజ్, రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి సాయిబాబా, మండల అధ్యక్షుడు సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.