
ఆత్మకూర్ హైస్కూల్ సందర్శన
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఆత్మకూర్ హైస్కూల్‌ను గురువారం ఎంఈవో భాస్కర్‌రెడ్డి సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న పాముల బెడదపై ‘సాక్షి’ దినపత్రికలో గురువారం ‘పాఠశాలలో పాముల బెడద..!’అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. పాఠశాలను పరిశీలించారు. తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పాఠశాల చుట్టూ ప్రహరీ లేకపోవడం వల్ల పాములు, తేళ్లతోపాటు ఇతర కీటకాలు ప్రవేశిస్తున్నాయని ఉపాధ్యాయులు ఎంఈవోతో పేర్కొన్నారు. ప్రహరీతోపాటు అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా చూడాలని వారు కోరారు.
తప్పులు లేకుండా ఓటరు
జాబితా రూపొందించాలి
మద్నూర్(జుక్కల్) : ఓటరు జాబితాను బీఎల్‌వోలు తప్పులు లేకుండా రూపొందించాలని ఈఆర్‌వో, అదనపు కలెక్టర్ చందర్ అన్నారు. డోంగ్లీలో గురు వారం బీఎల్‌వోలు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో బీఎల్‌వోల పాత్ర కీలకమని, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్ర మంలో తహసీల్దార్ ముజీబ్, డీటీ శివరామకృష్ణ, ఆర్‌ఐ సాయిబాబా పాల్గొన్నారు.

ఆత్మకూర్ హైస్కూల్ సందర్శన