
వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా వాల్యా
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్‌గా బి.వాల్యా నియమితులయ్యారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) సూపరింటెండెంట్‌గా పెరుగు వెంకటేశ్వర్లును నియమించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్(డీఎంఈ), రాష్ట్ర హెల్త్ సెక్రెటరీ క్రిస్టీనా జెడ్ చోంగ్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ వాల్యా గాంధీ మెడికల్ కళాశాలలో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. డాక్టర్ వెంకటేశ్వర్లు మహేశ్వరం మెడికల్ కళాశాలలో జనరల్ సర్జన్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వారికి ప్రభుత్వం ప్రమోషన్ కల్పించి, కామారెడ్డికి బదిలీ చేసింది. ఇప్పటి వరకు కళాశాల ప్రిన్సిపల్‌గా డాక్టర్ శివప్రసాద్, జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఫరీదా ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రారంభం నుంచి ఇన్‌చార్జీల పాలనే..
కామారెడ్డి మెడికల్ కళాశాల, జీజీహెచ్‌లు ప్రారంభం అయిన నాటి నుంచి ఇన్‌చార్జీల పాలనే కొనసాగింది. జీజీహెచ్ ఇన్‌చార్జీల పాలనలో నిధుల దుర్వినియోగం ఆరోపణలు వచ్చాయి. వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. పూర్తి స్థాయి ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ వస్తుండడంతో వైద్యశాల, జీజీహెచ్‌లలో సమస్యలు పరిష్కారం అవుతాయని, పాలన గాడిలో పడుతుందని భావిస్తున్నారు.
జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా
వెంకటేశ్వర్లు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా వాల్యా