
ముంబై రోడ్లపై ఇందూరువాసి
ఖలీల్‌వాడి: నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ముంబైలోని విక్ రోలీ వెస్ట్ ఫుట్‌పాత్‌పై ఉన్నట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వ్యక్తి వాటర్, టీ తీసుకుంటున్నాడని, ఇంగ్లిష్ దినపత్రికలు చదువుతున్నాడని, అడ్రస్ అడిగితే నిజామాబాద్ అని చెబుతున్నాడని తెలిపారు. తెలిసిన వారు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు.
‘డయల్ 100’ను దుర్వినియోగం చేసిన వ్యక్తికి జైలు
బోధన్: అత్యవసర సమయాల్లో వినియోగించుకోవాల్సిన ‘డయల్ 100’ను దుర్వినియోగం చేసిన వ్యక్తికి బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు టౌన్ సీఐ వెంకటనారాయణ సోమవారం తెలిపారు. రాకాసీపేట ప్రాంతానికి చెందిన ఎండీ ఫారూఖ్ మద్యం మత్తులో డయల్ 100కు కాల్ చేసి పోలీసుల సమయాన్ని వృథా చేయడంతోపాటు దుర్వినియోగానికి పాల్పడినందున కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా జడ్జి శిక్ష విధించారని పేర్కొన్నారు. ‘డయల్ 100’ను దుర్వినియోగం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.