
మోడల్ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): ఇంటర్మీడియట్‌లో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలనుకునే బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మోడల్ కళాశాలలు వరంగా మారాయి. 2025– 2026 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
ప్రతి గ్రూపులో 40 మంది విద్యార్థులు....
జిల్లాలో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, సదాశివనగర్, బాన్సువాడ,మద్నూర్‌లలో మోడల్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులలో మొదటి సంవత్సరంలో అడ్మిషన్లకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రతి గ్రూపులో 40 మంది విద్యార్థుల చొప్పున ఒక్కో కళాశాలలో 160 మంది విద్యార్థులకు అవకాశం లభించనున్నది.
జూన్ 1 నుంచి కళాశాలలు ప్రారంభం
మోడల్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థులు 2024–2025 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఆన్‌లైన్‌లో ఈనెల 20 లోగా దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన అనంతరం సాఫ్ట్ కాపీని ఆయా కళాశాలలో అందించాలి. ఇంటర్మీడియట్ మెరిట్ జాబితాను ఈనెల 26న ప్రకటించడం జరుగుతుంది. ఈనెల 27 నుంచి 31 వరకు కళాశాలలో ఎంపికై న విద్యార్థుల ఒరిజినల్ ధృవపత్రాల పరిశీలన చేయడం జరుగుతుంది. అనంతరం ఎంపికై న విద్యార్థులకు అడ్మిషన్ చేసుకుంటారు. జూన్ 1 నుంచి కళాశాలలు ప్రారంభం కానున్నాయి. మోడల్ కళాశాలలో ఎంపికై న విద్యార్థులకు ఇంటర్మీడీయట్ బోధన ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే ఆసక్తి గల విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న మంచి అవకాశం.
ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్మీయట్‌లో చదువుకునేందుకు ఈనెల 20 లోగా దరఖాస్తులు చేసుకోవాలి. మెరిట్ ప్రకారం సీట్లను కేటాయించడం జరుగుతుంది.
– తోటగాంధీ, ప్రిన్సిపాల్, మోడల్ కళాశాల, ఎల్లారెడ్డి
బాలికలకు ఉచిత వసతి
మోడల్ కళాశాలలో ఇంటర్మీడియల్‌లో చదివే విద్యార్థినులకు ప్రభుత్వం హాస్టల్ వసతిని కల్పిస్తుంది. కళాశాలకు 5 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చే విద్యార్థినులకు ఇబ్బంది కలుగకుండా 100 మంది విద్యార్థినులకు ఉచితంగా హాస్టల్ సౌకర్యాన్ని అందిస్తోంది.
విద్యార్థులకు రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపు
కేటగిరి సీట్లశాతం సీట్లు బాలురు బాలికలు
జనరల్ 50 20 13 07
ఎస్సీ 15 06 04 02
ఎస్టీ 06 02 01 01
బీసీ ఏ 07 03 02 01
బీసీ బీ 10 04 03 01
బీసీ సీ 01 00 00 00
బీసీ డీ 07 03 02 01
బీసీ ఈ 04 02 02 00
దివ్యాంగులకు 3శాతం
ఈనెల 20 వరకు ఆన్‌లైన్ లో
దరఖాస్తులకు అవకాశం
ఇంగ్లిష్ మీడియంలో బోధన
జిల్లాలో 6 మోడల్ కళాశాలలు

మోడల్ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

మోడల్ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్