
ఎప్‌సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా
నిజామాబాద్‌అర్బన్: ఎప్‌సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం ఫలితాలు విడుదల కాగా, పలువురు విద్యార్థులు ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. నగరంలోని నారాయణ జూనియర్ కళాశాలకు చెందిన హర్షిత్‌కు అగ్రికల్చర్ విభాగంలో 1314 ర్యాంకు, నిహాల్‌కు 2553 ర్యాంకు వచ్చింది. పదివేల లోపు పదిర్యాంకులు, 20వేలలో పు 26 ర్యాంకులను తమ విద్యార్థులు సాధించినట్లు ఏజీఎం లక్ష్మారెడ్డి అన్నారు.
కాకతీయ కళాశాలలో..
జిల్లా కేంద్రంలోని కాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థులు అనస్‌అలీ 1766 ర్యాంకు(అగ్రికల్చర్), ఎం.సంకీర్త్ 2398 , జి.వేదస్కర్ 2881, భవ్యశ్రీ 3310, ఎం.లోకేశ్ 3671, ఏ.వైష్ణవి 4172, రిషిక్ 5932, వి.నికేతన్ 6293 ర్యాంకులు సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ రామోజీరావు సన్మానించారు. కళాశాల డైరెక్టర్ తేజస్విని, ప్రిన్సిపల్ సందీప్, రణదీప్, శ్యామ్ పాల్గొన్నారు.
ఎస్‌ఆర్ కళాశాలలో..
నగరంలోని ఎస్‌ఆర్ కళాశాల విద్యార్థులు కార్తీక్ 572 ర్యాంకు, విష్ణువర్ధన్ 689 ర్యాంకు (అగ్రికల్చర్), అతీఫ్‌అఫ్‌నాన్ 1305 (అగ్రికల్చర్), నవదుర్గ 1484 (ఇంజనీరింగ్), శ్రీకాంత్ 1611(అగ్రికల్చర్), తేజస్విని 1914(అగ్రికల్చర్), జి.సిరి 2117(అగ్రికల్చర్), రాజశ్రీ 2175 ర్యాంకు (అగ్రికల్చర్) సాధించారు. విద్యార్థులను కళాశాల ఏజీఎం గోవర్ధన్‌రెడ్డి సన్మానించారు.
వెక్టార్ జూనియర్ కళాశాలలో..
నగరంలోని వెక్టార్ జూనియర్ కళాశాల విద్యార్థులు శ్రీవర్షిణి 1316 ర్యాంకు, మామిడి నిశాంత్‌రెడ్డి 1737, చంద్రవన్‌రెడ్డి 2532, వినాయక్ జోషి 2660, ఆర్గుల్ వెన్నెల 3554 ర్యాంకు సాధించారు. విద్యార్థులను కళాశాల చైర్మన్ మధుసూదన్‌జోషి అభినందించారు.
క్షతియ జూనియర్ కళాశాలలో..
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం చేపూర్ క్షత్రియ జూనియర్ కళాశాల విద్యార్థులు వివేక్‌రెడ్డి 1,813 ర్యాంకు (ఇంజినీరింగ్), హరివర్థిని 3,724 ర్యాంకు (అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ) సాధించినట్లు ప్రిన్సిపల్ నాగేశ్వర్ రావు తెలిపారు.
పెన్షన్ ఉద్యోగుల ప్రాథమిక హక్కు
నిజామాబాద్ నాగారం: పెన్షన్ ప్ర భుత్వ భిక్ష కాదని, ఉద్యోగుల ప్రాథమిక హక్కు అని, దానిని కాలరాసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్ర యత్నిస్తున్నాయని ఇన్సూరెన్స్ ఉ ద్యోగుల జాతీయ నాయకుడు జీ తిరుపతయ్య అన్నారు. ఎంప్లాయీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్ భవన్‌లో ఆదివారం నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ఈపీఎస్, న్యూ పెన్షన్ స్కీం, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షనర్లు, పాత పెన్షనర్లంటూ వర్గీకరించి పెన్షన్‌ను ఎగవేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగ, కార్మికులు పోరాటం చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ నెల 20న సమ్మెకు పూనుకున్నట్లు తెలిపారు. జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్, స్టడీ సర్కిల్ జిల్లా కన్వీనర్ రామ్మోహన్‌రావు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు వెంకటేశ్ , ఈవిల్ నారాయణ, నేతి శేఖర్, శ్రీనివాసరావు, విజయానందరావు, ఎల్ శ్రీధర్, మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఎప్‌సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా

ఎప్‌సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా

ఎప్‌సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా

ఎప్‌సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా