ఇరువర్గాల ఘర్షణ: పలువురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

ఇరువర్గాల ఘర్షణ: పలువురికి గాయాలు

May 12 2025 6:48 AM | Updated on May 12 2025 6:48 AM

ఇరువర

ఇరువర్గాల ఘర్షణ: పలువురికి గాయాలు

సమాచారం ఇచ్చినా స్పందించని పోలీసులు

వర్ని: మండల కేంద్రంలో ఆది వారం సాయంత్రం జరిగిన ఇ రు వర్గాల మధ్య ఘర్షణలో ప లువురికి గాయాలయ్యాయి. ఘర్షణపై పోలీసులకు సమాచా రం ఇచ్చిన స్పందించలేదని స్థానికులు తెలిపారు. వివరాలు ఇలా.. వర్నిలో ఆదివారం సాయంత్రం రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈఘటనపై ఇరువురి వాహనదారుల మధ్య మాటామాట పెరిగి చివరకి అంతాపూర్‌, తగిలేపల్లి గ్రామస్తుల మధ్య ఘర్షణగా మారింది.సుమారు గంటన్నరపాటు ఇరువర్గాలు తోపులాట, తిట్టుకోవడం, కొట్టుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. సుమారు గంటన్నర నుంచి పోలీసులకు, డయల్‌ 100కు ఫోన్‌ చేసిన స్పందించలేదని స్థానికులు మండిపడుతున్నారు.

ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

రుద్రూర్‌: పోతంగల్‌ మండలం కొడిచర్ల శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు నిఘా వేయగా ట్రాక్టర్‌ పట్టుబడింది. ఈ ట్రాక్టర్‌ను కోటగిరి పోలీస్‌స్టేషన్‌ తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సునీల్‌ తెలిపారు.

ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ

బాన్సువాడ రూరల్‌: మండలంలోని ఇబ్రాహింపేట్‌ గ్రామానికి చెందిన బండిసాయిలు అనే రై తు పొలంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను దుండగులు ధ్వంసం చేసి కాయిల్‌ చోరీచేశారు. సుమారు రూ.40వేల నష్టం వాటిల్లిన ట్లు ట్రాన్స్‌కో రూరల్‌ ఏఈ కిరణ్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం వరికోతలు పూర్తికావడంతో రైతులు పొలాలవైపు వెళ్లకపోవడంతో దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయని ట్రాన్స్‌కో అధికారులు పేర్కొంటున్నారు.

29 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

నవీపేట: నిజామాబాద్‌ నుంచి ధర్మాబాద్‌ వైపు అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై వినయ్‌ ఆదివారం తెలిపారు. టాటాఏస్‌ వాహనంలో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదు రావడంతో నవీపేట శివారులో పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. పట్టుబడిన బియ్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ మహేష్‌కుమార్‌కు అప్పగించామన్నారు. నిజామాబాద్‌లోని మాలపల్లికి చెందిన వాహన యజమాని షేక్‌ ఖయ్యూమ్‌, డ్రైవర్‌ సొఫియాన్‌లపై కేసు నమోదు చేశామన్నారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

నందిపేట్‌(ఆర్మూర్‌): మండలంలోని చింరాజ్‌పల్లి గ్రామ శివారులోగల తోట గణేష్‌ అనే వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం సుమారు 40 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమయింది. వడదెబ్బ తగిలి సుమారు రెండు మూడు రోజుల క్రితమే అతడు మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. మృతుడి ఒంటిపై బ్లూ కలర్‌ జీన్స్‌ ప్యాంట్‌, కాఫీ కలర్‌ టీషర్టు ఉన్నదని, సంబంధీకులు ఎవరైన ఉంటే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.

ఇరువర్గాల ఘర్షణ: పలువురికి గాయాలు
1
1/2

ఇరువర్గాల ఘర్షణ: పలువురికి గాయాలు

ఇరువర్గాల ఘర్షణ: పలువురికి గాయాలు
2
2/2

ఇరువర్గాల ఘర్షణ: పలువురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement