
కామారెడ్డి క్రైం: కామారెడ్డి మండలం టేక్రియాల్ శివారులో జాతీ య రహదారిపై బుధవారం సా యంత్రం లారీని వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా ఆమె భర్త, కుమారునికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ముల్లాఖాన్, అతని భార్య షబీనా (31), కుమారుడు జాఫర్ ఖాన్‌లతో కలిసి డీసీఎం వ్యాన్‌లో బెంగళూరు వైపు వెళ్తున్నారు. ఇల్చిపూర్‌కు సమీపంలోకి రాగానే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి డీసీఎం ఢీకొంది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ప్రయాణిస్తున్న షబీనా అక్కడికక్కడే మృతి చెందగా ఆమె ఆరేళ్ల కుమారుడు జాఫర్‌ఖాన్, భర్త ముల్లాఖాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
● మహిళ మృతి
● ఆమె భర్త, కుమారుడికి తీవ్ర గాయాలు