బోధన్: భార్యను వేధించి ఆమె ఆత్మహత్యకు కారకుడైన భర్తకు ఐదేళ్లు జైలు శిక్షణ, రూ.200 జరిమాన విధిస్తూ బోధన్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి దేవన్ అజయ్ కుమార్ మంగళవారం తీర్పును వెల్లడించారు. జరిమానా కట్టకపోతే మరో నెల రోజుల పాటు సాధారణ జైలు శిక్షణ అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం కోటగిరి మండలంలోని (ప్రస్తుతం పోతంగల్) దోమలెడ్గి గ్రామానికి చెందిన నాగమణి, బోధన్‌కు చెందిన కొప్పుల గజేందర్ ప్రేమించుకుని 2007 జనవరి 24న పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు హనీష్, కొడుకు సాయి హనీష్ ఉన్నారు. కొన్నేళ్త తర్వాత భార్యభర్తల మధ్య తగాదాలు జరుగుతుండేవన్నారు.
2019 ఫిబ్రవరి 24న గజేందర్ తన తమ్ముడి పెళ్లికి వెళ్లే విషయంలో భార్య నాగమణితో గొడవ జరిగింది. పెళ్లికి వచ్చేందుకు ఆమె నిరాకరించడంతో ఆమెను కొట్టాడు. మళ్లీ ఇంటికి తిరిగి వచ్చి రాత్రి సమయంలో నాగమణిని కొట్టి బయటకు వెళ్లిపోయాడు. మనస్తాపంలో అదేరోజు అర్థరాత్రి సమయంలో నాగమణి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరుసటి రోజు 2019 ఫిబ్రవరి 25న మృతురాలి తల్లి కోడూరు లక్ష్మి శ్యామల బోధన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అల్లుడు గజేందర్ కోటగిరి గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని, తన కూతురు నాగమణిని శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేయడంతోనే ఆమె మృతి చెందిందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో విచారణనంతరం జడ్పీ తీర్పునిచ్చారు.
నిందితురాలిని పట్టించిన సీసీ ఫుటేజీ
ఖలీల్‌వాడి : సీసీ ఫుటేజీ ఆధారంగా మార్కెట్‌లో డబ్బులు చోరీ చేస్తున్న మహిళను అరెస్ట్ చేసినట్లు ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు తెలిపారు. ఎస్‌హెచ్‌వో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 20న నగరంలోని దేవిరోడ్డులో ఆకుల ప్రగత్ తన భార్య బంగారాన్ని ఓ గోల్ మర్చంట్ వద్ద తాకట్టు పెట్టి రూ. 4 లక్షలు తీసుకున్నారు. అనంతరం దేవిరోడ్డులోని కిరాణాషాపు వద్ద సామాను కొనేందుకు వెళ్లి షాపులో తన డబ్బుల బ్యాగును పక్కన పట్టి, సామాను కొనుగోలు చేశారన్నారు. సామాను కొనుగోలు పూర్తయిన తర్వాత బ్యాగ్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు మేరకు దుకాణంలో సీసీటీవీ పుటేజీ ఆధారంగా వర్ని రోడ్డులోని చంద్రనగర్‌కు చెందిన బియాన్ వనజను పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. మహిళను పట్టుకున్న ఏఎస్సై షకీల్, రాజేష్, గంగారాం, ఆబ్దుల్ రహెమాన్‌ను ఏసీపీ కిరణ్‌కుమార్ అభినందించారు.
● భార్య ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు..