కామారెడ్డి క్రైం : ఆర్ధిక సమస్యల కారణంగా ఒకరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దెబ్బటి నవీన్ (23) కామారెడ్డిలో అడ్డా కూలీగా పనిచేస్తుండేవాడు. కూలి పనులు సరిగా దొరకక ఇటీవల ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. భా ర్య, పిల్లలతో కలిసి రాజీవ్ నగర్ కాలనీలోని తన తల్లిగారింటికి రాగా మధ్యాహ్నం నవీన్ తన ఇంట్లో ఉరేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య స్వరూప దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘట నా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.
కరోనా తర్వాత
విద్యావిధానంలో మార్పులు
నిజామాబాద్ అర్బన్ : కరోనా కంటే ముందు ఉన్న విద్యావిధానంలో కంటే కరోనా తర్వాత విధానంలో చాలా మర్పులొచ్చాయని తమిళనాడు అన్నామలై యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వీణ పేర్కొన్నారు. మంగళవారం సారంగపూర్‌లో రెండో రోజు జాతీయ విద్యావిధానం– 2020 అనే అంశంపై సదస్సు నిర్వహించగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు చేశారు.